4
May, 2026

A News 365Times Venture

4
Monday
May, 2026

A News 365Times Venture

Vijay-Trisha: త్రిష నాదే..? తమిళనాడు నాదే.. విజయ్ విజయధరహాసం..

Date:

తమిళనాడు రాజకీయాల్లో అరవై ఏళ్ళ ద్రవిడ పార్టీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ, దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ అఖండ విజయం దిశగా దూసుకుపోతున్నారు. అటు రాజకీయంగా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంతో పాటు, ఇటు వ్యక్తిగత జీవితంలో కూడా నటి త్రిషతో అనుబంధంపై వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో “త్రిష నాదే.. తమిళనాడు నాదే” అనే నినాదంతో వైరల్ అవుతున్నాయి. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీలను సింగిల్ హ్యాండ్‌తో ఎదుర్కొని విజయ్ సాధించిన ఈ విజయం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ వైపు శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం విజయ్ 108 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండి, స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎటువంటి ముందస్తు పొత్తులు లేకుండానే డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను వెనక్కు నెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించడం భారత రాజకీయాల్లోనే ఒక సంచలనం.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. అటు సీఎంగా పగ్గాలు చేపట్టబోతుండటంతో పాటు, ఇటు త్రిషతో పెళ్లి వార్తలపై వస్తున్న స్పష్టత అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. విజయ్ తన భార్య సంగీతతో విడాకుల ప్రక్రియ పూర్తికాగానే త్రిషను వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే త్రిష పుట్టినరోజు కావడం, ఆమె తిరుమల శ్రీవారిని సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.

గత కొంతకాలంగా వ్యక్తిగతంగానూ, సినీ రంగంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విజయ్, ఇప్పుడు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడుతుండటంతో తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మెజారిటీ తగ్గితే కాంగ్రెస్, పీఎంకే వంటి పార్టీల మద్దతు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విజయ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మొత్తానికి “తమిళనాడు నాదే.. త్రిష నాదే” అనే డైలాగ్ విజయ్ ఫ్యాన్స్‌కు సరికొత్త జోష్ ఇస్తోంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 47వ మ్యాచ్‌లో...

West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  సాధించిన చారిత్రాత్మక...

Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్ర పాలనను శాసిస్తున్న...

Exit Polls Failed: సర్వేలకు అందని ఓటర్ నాడి.. తలకిందులైన ఎగ్జిట్ పోల్స్..

ప్రస్తుత కాలంలో ఎన్నికల ఫలితాల కంటే ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్...