విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పూరి జగన్నాథ్ పరిస్థితి ప్రస్తుతానికి బాగోలేదు. ఎందుకంటే, ఆయన గతంలో చేసిన ‘లైగర్’ సినిమాతో పాటు ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కూడా బోల్తా కొట్టాయి. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడితో విజయ్ సేతుపతి ఎలా సినిమా చేస్తాడని అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, విజయ్ సేతుపతి ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్‌లో ఉన్నాడు. ఆయన చేస్తున్న ఏ సినిమా అయినా హిట్ అవుతోంది. ఇలాంటి సమయంలో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడితో సినిమా చేయాలి, కానీ డిజాస్టర్ దర్శకుడితో సినిమా చేయడమేంటని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ తో గోపీచంద్ మలినేని సినిమా..?
తాజాగా ఈ అంశంపై విజయ్ సేతుపతి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ, “నేను డైరెక్టర్లను వారి పాస్ట్ వర్క్ ఆధారంగా జడ్జి చేయను. నాకు స్క్రిప్ట్ నచ్చితే సినిమా సైన్ చేస్తాను. పూరి జగన్నాథ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. పూరి జగన్నాథ్ చెప్పిన నరేషన్ విన్న తర్వాత నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. నా సినిమాలు రిపీట్ అవుతున్నట్టు ఫీలింగ్ రాకుండా ఉండడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను,” అని చెప్పారు. ఇక ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. చార్మి కౌర్, పూరి జగన్నాథ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.