US Iran War: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా ఎప్పుడైనా ఇరాన్‌పై దాడి చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇరాన్‌పై వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇద్దరు కీలక వ్యక్తులు అధ్యక్షుడి నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. వారే ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్. ఈ ఇద్దరూ జెనీవాలో జరిగే కీలకమైన చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు.
READ ALSO: IPL 2026: కొత్త లోగోతో కొత్త ప్రారంభం.. Lucknow Super Giants కొత్త లోగో ఆవిష్కరణ!
ఈ వారం ఇరాన్ తన కొత్త ప్రతిపాదనను సమర్పించే అవకాశం ఉంది. గురువారం జెనీవాలో జరిగే చర్చలు చివరి రౌండ్ చర్చలు కావచ్చని అంటున్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకపోతే, ట్రంప్ మొదట పరిమిత వైమానిక దాడులను చేయించవచ్చని, అవి పని చేయకపోతే, పెద్ద దాడిని లేదా ఇరాన్లో అధికార మార్పుకు అడుగులు వేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో సైనిక ఎంపికలపై ట్రంప్‌కు అనేక బ్రీఫింగ్‌లు అందాయని సమాచారం. అధ్యక్షుడి కీలక సలహాదారులలో ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, సిఐఎ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డాన్ కైన్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఉన్నారు.
ఒకవేళ అమెరికా దాడి చేస్తే.. ఈసారి మరింత తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ బెదిరించింది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ, అమెరికా యుద్ధనౌకను ముంచివేసే సామర్థ్యం తమకు ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ట్రంప్ ఇరాన్ అణు సుసంపన్నతను పూర్తిగా నిలిపివేయాలని కోరుకుంటున్నారు, అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, తమ దేశం సుసంపన్నతను పూర్తిగా వదిలివేయడానికి సిద్ధంగా లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈక్రమంలో అమెరికా 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో తన అతిపెద్ద వైమానిక మోహరింపును ప్రారంభించింది. యుఎస్ విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ త్వరలో ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. అదనంగా, ఎఫ్-35, ఎఫ్-22 యుద్ధ విమానాలు, బాంబర్లు, ఇంధనం నింపే విమానాలు ఇప్పటికే ఇరాన్ వైపు మోహరించారు.
READ ALSO: US-Iran Tension: ఇరాన్ వార్‌కు ముందు, యూఎస్ సైన్యానికి ‘‘టాయిలెట్’’ సమస్య..




