23
March, 2026

A News 365Times Venture

23
Monday
March, 2026

A News 365Times Venture

UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!

Date:

‘‘ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు’’గా ఉందంటారు కొందరు వ్యక్తులను చూసి. కరెక్ట్‌గా అలాంటి వ్యవహారమే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గ్రామానికే పెద్దగా చెలామణి అయి.. దర్జాగా బ్రతికిన ఓ పెద్ద వ్యక్తి చివరికి ప్రియురాలి చేతిలో కుక్క చావు చచ్చాడు. ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద చర్చగా మారింది.

Up

ముస్తకా గుల్షన్ అలియాస్ మున్నా.. ఉత్తరప్రదేశ్‌లోని సుమేర్‌పూర్ గ్రామ మాజీ సర్పంచ్. ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కిస్మతుల్ నిషాకు తొమ్మిది మంది పిల్లలు ఉండగా.. రెండో భార్య అంబియా బానోకు కూడా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. మొత్తంగా 18 మంది పిల్లలున్నారు. అయితే గ్రామ సర్పంచ్‌గా పని చేసిన మున్నా బుద్ధి మాత్రం మంచిగా లేదు. ఇద్దరు భార్యలుండి.. 18 మంది పిల్లలుండి కూడా వంకర బుద్ధి చూపించాడు.

గ్రామంలో ఉన్న సుమన్ దేవి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సుమన్ దేవి భర్త ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇదే అదునుగా ఆమెకు సాయం పేరుతో దగ్గరయ్యాడు. పదే పదే కలవాలంటూ ఒత్తిడి తేవడం.. అక్కడితో ఆగకుండా బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఈ వ్యవహారం భర్తకు తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో తన సోదరుడితో కలిసి మున్నా హత్యకు ప్రణాళిక రచించింది. ప్లాన్‌లో భాగంగా మార్చి 18న తన పుట్టింటికి సుమన్ దేవి ఆహ్వానించింది. దీంతో మున్నా గదిలోకి రాగానే సోదరుడు, అతడి అనుచరులు కలిసి రాడ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో కుక్కి కాలువలో పడేశారు.

అయితే మున్నా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలో దిగారు. మున్నా మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి బైక్ వేరే చోట గుర్తించారు. అలాగే ఫోన్ కాల్స్ రికార్డ్స్ ప్రకారం నిందితురాలను గుర్తించారు. విచారించగా తన సోదరుడితో కలిసి హత్య చేసినట్లుగా సుమన్ దేవి ఒప్పుకుంది. అనంతరం మార్చి 22 (ఆదివారం)న కాలువ దగ్గర మున్నా మృతదేహాన్ని గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.

మున్నాకు ఇద్దరు భార్యలు, 18 మంది సంతానం ఉన్నారని.. ఒక కుమార్తెకు వివాహం కూడా జరిపించాడని పోలీసులు తెలిపారు. మరోసారి గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేయాలని సిద్ధపడుతున్నాడని.. ఈ క్రమంలో సుమన్ దేవితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. పదే పదే బెదిరించడంతో ప్రియురాలు చంపేసిందని వెల్లడించారు. అయితే మున్నా చనిపోవడంతో ఇద్దరు భార్యలు, పిల్లలు తీవ్ర విషాదంతో కన్నీరు మున్నీరయ్యారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..

అమెరికా , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు...

Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

Raghav Chadha: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రస్తావించే ప్రతి అంశం...

Dhurandhar 4 days Collections : ధురంధర్ 2 వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్.. ఊచకోత కోసిన రణవీర్ సింగ్

బాలీవుడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద...

LaGuardia Airport: లాగార్డియా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై ట్రక్కును ఢీకొన్న విమానం.. 100 మంది ప్రయాణికులు!

న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ...