11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!

Date:

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య చనిపోయిన రెండేళ్ల తర్వాత మొబైల్‌కు ఓటీపీ వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలేం జరిగింది? ఓటీపీ మిస్టరీ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Upcase

సందీప్-ప్రియాంక భార్యాభర్తలు. మే 14, 2017న వివాహం జరిగింది. ప్రియాంకది కప్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పిల్ఖాన్ గ్రామం. సందీప్‌ది బస్తీ జిల్లా. ఏడేళ్లు సంసారం బాగానే సాఫీగా సాగింది. ఒక కొడుకు కూడా జన్మించాడు. అనంతరం భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం ప్రారంభం అయ్యాయి. జూలై 1, 2024న ఇంట్లో నుంచి నగలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని ఆరోపణలు వచ్చాయి. అలా ఆరోపణలు వచ్చాయో.. లేదో గంటల వ్యవధిలోనే బిడ్డను తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు అయోధ్యకు వెళ్లింది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడుతుండగా.. రాజస్థాన్ నుంచి అయోధ్యకు వచ్చిన మంగళచంద్ర అనే వ్యక్తి అడ్డుకున్నాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళచంద్రతో కలిసి రాజస్థాన్ వెళ్లిపోయి భార్యాభర్తలుగా జీవిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Shopping Mall: షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే..!

అయితే ఇంతలో భార్య అదృశ్యం కావడంపై సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగల కోసం తన భార్యను అత్తమామలు చంపేసి నదిలో పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును పోలీసులు స్వీకరించలేదు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. నవంబర్ 4, 2024న న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రియాంక తండ్రి దయారాం, తల్లి శుభవతి దేవి, మామ కుమార్తె, మరొక గ్రామస్థుడు అశోక్ కుమార్ మౌర్యపై కప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నిందితులుగా చేర్చి హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఇకపై ఇలా చేయాల్సిందే!

అయితే ఈ క్రమంలో ప్రియాంక ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లింది. ఫొటో, అడ్రస్ మార్పు చేసుకుంటుండగా సడన్‌గా ‘‘ఓటీపీ’’ నెంబర్ సందీప్‌ మొబైల్‌కు వెళ్లింది. ఆధార్ ఓటీపీ రావడంతో ఒక్కసారిగా అవాక్కై పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే పోలీసులు రాజస్థాన్‌లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూపీలాగారు. ప్రియాంక చిరునామా తెలుసుకుని ఇంటికి వెళ్లగా ప్రత్యక్షమైంది. అనంతరం ఆమెను బస్తీ జిల్లాకు తీసుకొచ్చారు.

పోలీస్ స్టేషన్‌లో ప్రియాంకను చూసి తండ్రి దయారాం, భర్త సందీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి కౌగిలించుకుని ఏడ్చారు. సందీప్ తన కుమారుడిని దగ్గర తీసుకునేందుకు ప్రయత్నించగా వెళ్లేందుకు నిరాకరించాడు. కుమారుడు నిజమైన తండ్రి అని గుర్తించలేకపోయాడు. భార్యను ఉంచుకునేందుకు ఇష్టపడ లేదు గానీ.. బిడ్డను దత్తత ఇవ్వాలని సందీప్ కోరగా ఆమె నిరాకరించింది.

11

2024లో కప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మహిళ హత్యకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని ఏఎస్పీ శ్యామ్‌కాంత్ తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు. బిడ్డను అప్పగించాలని సందీప్ కోరాడని.. దీనిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

12

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rafale fighter jets: ఆపరేషన్‌ సిందూర్‌లో అసలైన హీరో ‘‘రాఫెల్ జెట్స్’’..

Rafale fighter jets: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళానికి...

Deepali Ghosh: హ్యాట్సాఫ్ బామ్మ.. నెటిజన్ల మనసు గెలుచుకున్న 70 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్

Deepali Ghosh: ఒక బామ్మ కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా...

Gaurav Gogoi: “అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్‌లో గడిపాం.. కానీ”.. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!

Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం...

AR Rahman : టాలీవుడ్‌లో రెహమాన్ సెకండ్ ఇన్నింగ్స్.. ‘పెద్ది’ మ్యూజిక్ తెచ్చిన క్రేజ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా...