TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్ ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ సేవా టికెట్లు, దర్శన టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు రిజిష్ర్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ఇక, ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది టీటీడీ.. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. ఆ తర్వాత భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో.. తిరిగి సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతి ఇస్తోన్న విషయం విదితమే..
Read Also: Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి..