అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో మీడియా సమావేశంలో సుంకాలు వెల్లడించారు. అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా భవిష్యత్ అమెరికన్ల చేతుల్లోనే ఉందని తెలిపారు. ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నా.. తాము మాత్రం సగమే విధిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశాలపై ఉన్న ప్రేమతోనే సగం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇండియాపై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు వెల్లడించారు. తనకు మోడీ గొప్ప స్నేహితుడని.. అయితే భారత్.. అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని పేర్కొన్నారు.