21
February, 2026

A News 365Times Venture

21
Saturday
February, 2026

A News 365Times Venture

Trump: ‘‘న్యాయమూర్తులు మూర్ఖులు.. లాప్‌‌డాగ్‌లు’’.. టారిఫ్‌లు రద్దు చేయడంపై ట్రంప్ ఆగ్రహం

Date:

ప్రపంచ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ న్యాయమూర్తులపై విరుచుకుపడ్డారు. ‘‘రాడికల్-లెఫ్ట్ డెమొక్రాట్లు మూర్ఖులు.. లాప్‌‌డాగ్‌లు’’ అంటూ ధ్వజమెత్తారు. న్యాయస్థానంలోని కొంత మంది సభ్యుల తీరు పట్ల సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు. 6-3 తేడాతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత చాలా నిరాశ చెందినట్లుగా చెప్పారు. మన దేశానికి సరైంది చేయడానికి న్యాయమూర్తులకు ధైర్యం లేదన్నారు. డెమొక్రాట్లు నియమించిన న్యాయమూర్తలు అవమానకరం అని అభివర్ణించారు.

ఈ తీర్పుతో సంవత్సరాలుగా మనల్ని మోసం చేస్తున్న విదేశీ దేశాలన్ని సంబరాల్లో మునిగిపోయాయన్నారు. ప్రస్తుతం వాళ్లంతా సంతోషంగా ఉంటారని తెలిపారు. ఇప్పుడు వాళ్లు వీధుల్లో నృత్యం చేస్తూ ఉంటారు.. కానీ వారు ఎంతో కాలం నృత్యం చేయలేరులే అన్నారు. తన పరిపాలన ప్రత్యామ్నాయ చర్యలతో ముందుకొస్తుందని హెచ్చరించారు. దేశభక్తి లేని వారు రాజ్యాంగం పట్ల విశ్వాసపాత్రులు కాదన్నారు. 2024లో మిలియన్ల ఓట్లతో గెలిచానని.. కానీ తన అజెండాకు మద్దతు ఇచ్చేందుకు న్యాయమూర్తులు భయపడుతున్నారని పేర్కొన్నారు.

ఇక తీర్పును విభేదించిన న్యాయమూర్తులు క్లారెన్స్ థామస్, శామ్యూల్ అలిటో, బ్రెట్ కవనాగ్‌లను ట్రంప్ ప్రశంసించారు. టారిఫ్‌లు కొట్టేసిన ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్, న్యాయమూర్తులు అమీ కోనీ బారెట్, నీల్ గోర్సుచ్‌లను తీవ్రంగా విమర్శించారు. వారంతా ‘‘రాడికల్-లెఫ్ట్ డెమొక్రాట్లకు మూర్ఖులు, లాప్‌డాగ్‌లు.’’ అని దుమ్మె్త్తిపోశారు.

అయినా అలా తీర్పు వచ్చిందో లేదో తగ్గేదేలేదంటూ ట్రంప్ తన దూకుడును చూపించారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఓవల్ కార్యాలయం నుంచి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేసి సోషల్ మీడియాలో వెల్లడించారు. కొత్త ఉత్తర్వు ప్రకారం అన్ని దేశాల నుంచి దిగుమతులపై 10 శాతం సుంకం విధించినట్లు పేర్కొన్నారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధించడంపై తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని రాసుకొచ్చారు.

T1



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Lovers Su*icide: హైదరాబాద్‌లో ప్రేయసి ఆత్మహత్య.. భయంతో విశాఖలో ప్రాణాలు తీసుకున్న ప్రియుడు..! ఏం జరిగింది..

Lovers Suicide: విశాఖలోని భీమిలి సమీపంలో లాడ్జిలో ఓ యువకుడు అనుమానస్పద...

Fake Universities Across India: దేశవ్యాప్తంగా 32 యూనివర్సిటీలను ఫేక్ గా ప్రకటించిన యూజీసీ..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), భారతదేశం అంతటా 32 నకిలీ విశ్వవిద్యాలయాలుగా...

Jio Rs 365 Recharge Plan: జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్.. 25GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ మరెన్నో బెనిఫిట్స్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్ ను తీసుకొచ్చింది....

Lashkar-e-Taiba: దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడికి లష్కరే కుట్ర..

Lashkar-e-Taiba: పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో...