11
April, 2026

A News 365Times Venture

11
Saturday
April, 2026

A News 365Times Venture

Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

Date:

భారత్ లో పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నూతన వధూవరులు మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతారు. ఆతర్వాత భరత్ లో అంతా ఒక్కచోట చేరి డ్యాన్సులతో పెళ్లి వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నా పెద్ద కలిసి ఆనందంగా పాల్గొంటారు. ఇలాగే జరిగిన ఓ ప్రత్యేకమైన వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఆ కుటుంబం పెళ్లికి హాజరయ్యేందుకు రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకుంది. ఈ ప్రయాణానికి సంబంధించిన ఒక క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో బంధువుల ఆనందం, పిల్లల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read:Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?

కుటుంబం రైలు ఎక్కిన వెంటనే వాతావరణం పండుగలా మారిపోవడం వీడియోలో కనిపిస్తుంది. పిల్లలు, యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ సంగీతానికి నృత్యం చేస్తూ కనిపిస్తారు. ఎక్కడ చూసినా నృత్యం, వినోదంతో ఆ కోచ్ మొత్తం ఒక పార్టీలా తయారైంది. ప్రారంభంలో ఒకరు రైలు కోచ్‌ను పూల దండలతో అలంకరించి, అతిథులకు స్వాగతం పలుకుతూ పోస్టర్లను అతికిస్తారు. ఆ తర్వాత, నృత్యం మొదలవడంతో వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారుతుంది. కాబోయే వధువు కేక్ కట్ చేస్తుండగా, కుటుంబమంతా ఆమెను ఉత్సాహపరుస్తున్న దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తుంది.

కోచ్ లోపల దుప్పట్లు, గిఫ్ట్ బాక్సులను కూడా ఉంచి ఉండటం పెళ్లి సన్నాహాలను సూచిస్తుంది. ఇంతలో, టికెట్ కలెక్టర్ తన పని తాను చేసుకుంటూ వెళ్లడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతను కూడా ఆ వేడుకలో భాగమవుతాడు. ఈ వీడియోను @Ananth_IRAS అనే ట్విట్టర్ ఖాతా ‘POV: ఎ మార్వారీ వెడ్డింగ్’ అనే శీర్షికతో పంచుకున్నారు.

ఇలా బుక్ చేసుకునే వీలుందా?

అవును, భారతీయ రైల్వేలో ఒక రైలు కోచ్ మొత్తాన్ని (బోగీ పూర్తిగా) బుక్ చేసుకోవచ్చు. దీనిని Full Tariff Rate (FTR) స్కీమ్ ద్వారా చేస్తారు. ఇది పెళ్లిళ్లు, ఫ్యామిలీ టూర్లు, గ్రూప్ ట్రావెల్, స్కూల్/కాలేజ్ యాత్రలు వంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది.

ఎలా బుక్ చేయాలి?

ఇది IRCTC సాధారణ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కాదు. ప్రత్యేక FTR పోర్టల్ ఉపయోగించాలి.

ఆన్‌లైన్ బుకింగ్:వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.ftr.irctc.co.in
కొత్త యూజరైతే రిజిస్టర్ చేసుకోండి (ఈమెయిల్, మొబైల్ నంబర్‌తో).
లాగిన్ అయి, Coach Booking ఎంచుకోండి.
మీ ప్రయాణ వివరాలు ఇవ్వండి (నుంచి స్టేషన్, గమ్యం, తేదీ, ట్రైన్ నంబర్/టైప్, కోచ్ రకం – స్లీపర్, 3AC, 2AC మొదలైనవి).
ప్యాసింజర్ల లిస్ట్ అప్‌లోడ్ చేయండి.
రిజిస్ట్రేషన్ అమౌంట్ చెల్లించండి → FTR నంబర్ వస్తుంది.

ఆఫ్‌లైన్ బుకింగ్:

ప్రయాణం మొదలయ్యే స్టేషన్‌లో Chief Booking Supervisor (CBS) లేదా Station Manager వద్ద వ్రాతపూర్వక అప్లికేషన్ ఇవ్వండి.
అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసి, డిపాజిట్ చెల్లించాలి.

నియమాలు & ఛార్జీలు

బుకింగ్ సమయం: గరిష్టం 6 నెలల ముందు, కనీసం 30 రోజుల ముందు అప్లై చేయాలి.
రిజిస్ట్రేషన్ డిపాజిట్:ఒక్క కోచ్‌కి సాధారణంగా రూ.50,000 (7 రోజులలోపు ప్రయాణం కోసం).
7 రోజులు మించితే అదనపు ఛార్జీలు వస్తాయి.
ఇది రీఫండబుల్ (కొన్ని షరతులతో).

Also Read:9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

ఒక ట్రైన్‌లో ఎన్ని కోచ్‌లు?

సాధారణంగా గరిష్టం 2 కోచ్‌లు (కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా సాధ్యం, కానీ టెక్నికల్ ఫీజిబిలిటీ బట్టి).
పూర్తి రైలు (ట్రైన్ చార్టర్): 18 నుంచి 24 కోచ్‌ల వరకు (2 SLR కోచ్‌లు తప్పనిసరి).
ఖర్చు: సాధారణ టికెట్ల కంటే 30-35% ఎక్కువ ఉండవచ్చు. అదనంగా ఖాళీ రన్ ఛార్జీలు, మెయింటెనెన్స్, సేఫ్టీ ఛార్జీలు వస్తాయి.
కోచ్ అటాచ్ చేయడానికి ట్రైన్ స్టాపేజ్ కనీసం 10 నిమిషాలు ఉండాలి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో, CNG SUVs భారతీయులకు...

Mumbai: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మీరా భయందర్ ప్రాంతంలోని మురికివాడల్లో పెద్ద...

Gold Seized: ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.. లేడీ స్మగ్లర్స్ నుండి 30 కేజీల బంగారం సీజ్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.38 కోట్లు విలువచేసే...