17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

Tragedy : ప్రేమ పెళ్లి.. చివరికి హత్య..! విషాదంతంగా యుట్యూబర్ వైష్ణవి లైఫ్..

Date:

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడై, ఐదు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ గంధం వైష్ణవి (21) హత్య స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

గత ఏడాది కాలంగా మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి, కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ప్రేమించుకున్నారు. హరిబాబు తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించినప్పటికీ, వైష్ణవిపై ఉన్న ప్రేమతో హరిబాబు తన కుటుంబాన్ని వదులుకుని ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి ఆమె పుట్టింటిలోనే (మాదాపూర్) నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం వైష్ణవి ఐదు నెలల గర్భిణీ.

Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

గత కొద్దిరోజులుగా హరిబాబుకు తన తల్లిదండ్రులతో ఆస్తి విషయమై గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దంపతుల మధ్య కూడా విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున ఏం జరిగిందో ఏమో కానీ, హరిబాబు విచక్షణ కోల్పోయి తాను ఎంతగానో ప్రేమించిన వైష్ణవిని కత్తితో శరీరమంతా పొడిచి కిరాతకంగా చంపేశాడు. హత్య అనంతరం తానే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.

కళ్లముందే గర్భవతిగా ఉన్న కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి వైష్ణవి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. నిందితుడు హరిబాబుకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. “మా అమ్మాయిని అన్యాయంగా చంపిన వాడిని మాకే అప్పగించండి” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై డీఎస్పీ రాములు స్పందించారు. హత్యకు గల అసలు కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయా? లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి ఏదైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Se*xual Harassment : రక్షకుడే భక్షకుడైతే..?.. బాధితురాలి మైనర్ కుమార్తె కన్నేసిన ఇన్‌స్పెక్టర్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Supreme Court: చనిపోయినోళ్ల బ్యాంక్ వివరాలు బిడ్డలకు ఎందుకు చెప్పకూడదు.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

చనిపోయిన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల వివరాలు వారసులకు ఎందుకు చెప్పకూడదని కేంద్రాన్ని...

KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..

KTR : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ...

YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్‌!

పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేషే అని...