11
April, 2026

A News 365Times Venture

11
Saturday
April, 2026

A News 365Times Venture

TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్‌కు రండి

Date:

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు, ప్రతిపక్షాల విమర్శలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ, ప్రభుత్వ పనితీరు , భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని మహేష్ గౌడ్ గుర్తు చేశారు. “జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా 14 సార్లు బీ-ఫాం ఇచ్చింది. ఆయన రాజకీయ ఎదుగుదలకు పార్టీ ఎంతో కృషి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు. అటువంటి నేతపై ‘రేవంత్ పోవాలి.. మార్పు రావాలి’ అని మాట్లాడటానికి జీవన్ రెడ్డి ఎవరు?” అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ చేసిన అవినీతిని జీవన్ రెడ్డి స్వయంగా అనేకసార్లు విమర్శించారని, ఇప్పుడు పార్టీ లైన్ దాటి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణలను పీసీసీ చీఫ్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు కేవలం బురదజల్లే రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. “పొంగులేటి అవినీతిపై ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే నేరుగా గాంధీ భవన్‌కు రండి. చర్చకు నేను సిద్ధం, నా సవాల్‌ను స్వీకరించండి. పక్కా ఆధారాలు చూపిస్తే ప్రభుత్వం తరపున కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప, బట్టకాల్చి మీద వేస్తామంటే కుదరదు” అని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రులు జేబులు నింపుకున్నారని, నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. నాటి దోపిడీ గురించి ఇప్పుడు కవిత కూడా చెబుతున్నారని, అప్పట్లో దోచుకున్న వారు నేడు మా మంత్రులపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

మహేష్ కుమార్ గౌడ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కబోతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. “నాకు డిప్యూటీ సీఎం పదవి వస్తుందని వస్తున్న వార్తలు చూస్తుంటే సంతోషంగా ఉంది. కానీ, ఆ వార్తలు ఎందుకు రాస్తున్నారో, దేని ఆధారంగా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండటమే నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. మంత్రి పదవుల కంటే పీసీసీ పదవే బెటర్ అని నా భావన. మంత్రి పదవుల భర్తీ అనేది పూర్తిగా ఏఐసీసీ (AICC) పరిధిలోని అంశం. ప్రస్తుతానికి పార్టీ కోసం పనిచేస్తూ, సంస్థను బలోపేతం చేయడమే నా లక్ష్యం” అని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, తాను పీసీసీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!

SRH Powerplay Record: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా...

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో భాగంగా 900 పిల్లలను...

Best CNG SUVs India: దేశంలో అత్యంత చౌకైన 5 CNG SUVలు ఇవే.. ధరలు రూ. 6.75 లక్షల నుండి ప్రారంభం

ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో, CNG SUVs భారతీయులకు...