22
April, 2025

A News 365Times Venture

22
Tuesday
April, 2025

A News 365Times Venture

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Date:

నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్​ పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ‘హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొండి..’ అని జపాన్ కంపెనీలను సీఎం తెలంగాణకు ఆహ్వానించారు.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ పలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ పలితాలు విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొననున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.. ఫలితాలను సీజీజీ ప్రాసెస్ చేసింది.. వాళ్ళకి వారం రోజుల టైమ్ కావాలని అడిగారు ఇచ్చాము.. రేపు 12 గంటల తర్వాత ఫలితాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.. సర్వర్ లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం.. 60 లక్షల జవాబు పత్రాలను కరెక్షన్ చేయడం జరిగింది.. పేపర్ కరెక్షన్ ప్రక్రియలో 18 వేల 500 మంది స్టాఫ్ పాల్గొన్నారు.. పారదర్శకత కోసం అన్ని evaluation సెంటర్ లలో సీసీ కెమెరాలు పెట్టాము.. ఆన్సర్ స్క్రిప్టులను రాండమ్ గా చెక్ చేసాము.. పరీక్ష ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు రాకుండా లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం..

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని ఇరిగేషన్ అస్తవ్యస్తమైంది
నేటి నుంచి రాజమండ్రి జిల్లాలో 45 ఇసుక ర్యాంపులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో నాలుగు నెలలు ఇసుక కొరత రాకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక స్టాక్ పాయింట్లు ఈరోజు నుంచి ఏర్పాటు చేస్తున్నాం.. ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో భారీ ఎత్తున చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇక, ప్రతి రైతు ప్రభుత్వ నిర్ధారించిన రైస్ మిల్లులకే అమ్మాలని మంత్రి నిమ్మల తెలిపారు. అయితే, ధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని మంత్రి రామానాయుడు చెప్పుకొచ్చారు. రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజ కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లులు వెనకబడి ఉంటున్నారని అపవాదుపై చర్యలు తీసుకుంటాం.. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని ఇరిగేషన్ అస్తవ్యస్తమైంది.. మే నెలలో 10 కోట్ల 39 లక్షల రూపాయల వ్యయంతో గోదావరి ఆధునీకరణ పనులు చేపడుతామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఎయిర్ పోర్టు దగ్గర కాపు కాసిన సిట్ అదుపులోకి తీసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాజ్ కేసిరెడ్డి. మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు కేసిరెడ్డి.. రేపు విచారణకు వస్తానంటూ ఈ మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు. రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సీఐడీ.. ఇమ్మిగ్రేషన్ సమయంలో ఏపీ పోలిసులకు సమాచారం.. ఇవాళ రాత్రి విజయవాడకి రాజ్ కేసిరెడ్డి ని తీసుకువచ్చే అవకాశం.. రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించిన అధికారులు.. రేపు సిట్ ఎదుట విచారణకు హాజరు అవుతానని ఇవాళ ఆడియో విడుదల చేసిన రాజ్ కేసిరెడ్డి.. ఇప్పటి వరకు నాలుగు సార్లు సిట్ రాజ్ కేసిరెడ్డికి నోటీసులు ఇచ్చినా విచారణకు గైర్హాజరు.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చే వారానికి వాయిదా వేయటంతో విచారణకు వస్తున్నట్టు తెలిపిన రాజ్ కేసిరెడ్డి.. రోడ్డు మార్గాన రాజ్ కేసిరెడ్డిని విజయవాడ తీసుకు వస్తున్న సిట్.. రేపు విచారణకు వస్తాడో రాడో అని అనుమానంతో అదుపు తీసుకోవడం జరిగింది అని సిట్ అధికారులు చెప్తున్నారు.

రేపు వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం..
రేపు (ఏప్రిల్ 22వ తేదీన) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరు కానున్నారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పునర్ వ్యవస్థీకరించి 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమకం చేపట్టారు. ఇక, పీఏసీ కో- ఆర్డినేటర్ గా వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించనున్నారు. పీఏసీ సమావేశంలో పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా నరేంద్ర మోడీ అధికార నివాసానికి వెళ్లారు జేడీ వాన్స్. వారికి మోడీ ఘన స్వాగతం పలికారు. స్వయంగా వారిని లోపలికి ఆహ్వానించారు. గత ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ప్రకటించిన ‘ఇండియా-అమెరికా టెక్నాలజీ పార్ట్ నర్ షిప్ ట్రస్ట్’ ను వీరు ప్రారంభిస్తారు. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వీరిద్దరూ చర్చించబోతున్నారు. ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక రాజకీయ సంబంధాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుసగా టారిఫ్స్ విధిస్తున్న టైమ్ లో వీరిద్దరి భేటీ ఆసక్తిరేపుతోంది. వీటిపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఈ చర్చల తర్వాత జేడీ వాన్స్ కుటుంబానికి, అమెరికా అధికారులకు మోడీ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. 24 వరకు జేడీ వాన్స్ ఫ్యామిలీ ఇండియాలో పర్యటించబోతోంది. తాజ్ మహల్ తో పాటు ఇతర చారిత్రక కట్టాలను వారు సందర్శిస్తారు. జేడీ వాన్స్ వైఫ్ ఉష మన భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లిదండ్రులు, లక్ష్మీ-క్రిష్ ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలో లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు.

మురికివాడలు కూల్చి విఐపిల కోసం రోడ్లు వేస్తారా..
ఏపీ అధికారి హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పై సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2013లో హైదరాబాదులో మురికి వాడలను కూల్చోద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 80 మంది పోలీసులను పెట్టి ఉత్తర్వులను ఉల్లంఘిస్తారా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మురికివాడలను కూల్చారు నాటి తహసిల్దార్. దీంతో కోర్టు ధిక్కరణ కింద జైలు పాలయ్యారు ఆ అధికారి. విభజన సమయంలో ఈ ఘటన జరిగిందని, అధికారికి పిల్లలు ఉన్నారని వదిలివేయాలని అధికారి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కూలిన ఇళ్లలోని చిన్నారుల పరిస్థితి ఏమిటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇల్లు కూల్చినందుకు భారీ ఎత్తున నష్టపరిహారం విధిస్తామని హెచ్చరించింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడానికి ఎంత ధైర్యం ఉండాలి.. మా ఉత్తర్వులను ఉల్లంఘిస్తే అరెస్టు ఉత్తర్వులు ఇస్తాం.. ఆ అధికారి హైకోర్టు కంటే ఎక్కువనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం ఆయన తాసిల్దార్ స్థానంలో లేరని ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఉన్నారని పిటిషన్ తరపున న్యాయవాది వెల్లడించారు. అయితే మురికివాడలు కూల్చి విఐపిల కోసం రోడ్లు వేస్తారా అని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహార శైలి అంగీకరించమని స్పష్టం చేసింది. ఘాటైన వ్యాఖ్యల తర్వాత పిటీషనర్ వాదనను వినేందుకు జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం అంగీకరించింది.

అందుకే అక్కడ ఫస్ట్ నైట్ సీన్లు పెడుతా.. సంపత్ నంది క్రేజీ ఆన్సర్
డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా మారి తీసిన మూవీ ఓదెల-2. ప్రస్తుతం థియేటర్లో ఆడుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో సంపత్ నంది మూవీ విశేషాలను పంచుకున్నారు. డైరెక్టర్ అశోక్ తేజ ఈ మూవీని బాగా తీశాడన్నారు. తమన్నా నాగసాధువు పాత్రకు తగిన న్యాయం చేసిందంటూ ప్రశంసించారు. అయితే ‘మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు అన్నీ పొలాల దగ్గరే ఎందుకు పెడతారు.. మీకేమైనా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ ఉందా’ అని ఓ రిపోర్టర్ షాకింగ్ ప్రశ్న వేశాడు. దానికి సంపత్ నంది కూడా ఆశ్చర్యపోయాడు. తనకు అలాంటి ఎక్స్ పీరియన్స్ ఏమీ లేదని నవ్వుతూ చెప్పాడు. ‘ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కటి ఫేమస్. మా ప్రాంతంలో పొలాల దగ్గర మంచెలు చాలా బాగుంటాయి. పొలాల దగ్గర మంచెల మీద కూర్చుని ఉంటే ఆ ఆనందం వేరు. వాటిని గుర్తు చేసే ఉద్దేశంతోనే అలా పెట్టానేమో అనిపిస్తుంది. అంతే తప్ప అందులో ప్రత్యేకించి వేరే ఉద్దేశం లేదు. చాలా రోజుల తర్వాత మంచెలపై ఫస్ట్ నైట్ సీన్ పెడితే కొత్తగా ఉంటుందనే తాట్ వచ్చింది. అందుకే ఇలా పెట్టాం’ అంటూ చెప్పుకొచ్చాడు సంపత్ నంది. ఇక ఓదెల-2 ఇంకా బ్రేక్ ఈవెన్ పూర్తి చేయలేదు. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ కు దగ్గర్లో ఉన్నాయి కలెక్షన్లు. ఆ మూవీకి మూడో పార్టును కూడా తీస్తామని క్లారిటీ ఇచ్చేశారు. అయితే కపాల మోక్షం జరిగింది తిరుపతికి కాదేమో అన్న హింట్ ఇచ్చారు డైరెక్టర్ సంపత్ నంది.

తులం బంగారానికి లక్ష.. అయినా ఆగట్లేదుగా..
తులం బంగారం లక్ష రూపాయలకు దగ్గరైంది. అవును మీరు విన్నది నిజమే. బంగారం చరిత్రలోఎన్నడూ లేనంతగా భారీ ధరకు చేరుకుంది. గత ఏడాది కాలంగా ప్రతి రోజూ బంగారం పెరుగుతూనే పోతోంది. లక్ష రూపాయలకు కొద్దిపాటి దూరంలోనే ఉంది. మరికొన్ని గంటల్లోనే లక్షను క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98350కి చేరుకుంది. ఇది హైదరాబాద్ లో ధర. బంగారం ఇంతటి గరిష్ట స్థాయికి మునుపెన్నడూ రాలేదు. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90150గా ఉంది. ఇండియాలో బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. మిగతా బ్రాండ్ల మీద కంటే బంగారం మీదనే పెట్టుబడులు పెడుతున్నారు. పైగా ఇప్పుడు ఇండియాలో పెళ్లిళ్ల సీజన్. ఈ లెక్కన బంగారానికి మరింత డిమాండ్ ఏర్పడుతోంది. పైగా రియల్ ఎస్టేట్, ఫిక్స్ డ్ డిపాజిట్లపై పెద్దగా లాభం లేదని.. బంగారం మీదనే భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు బంగారం ధరించడానికే కాదు.. అవసరానికి ఉపయోగపడే వస్తువుగా చూస్తున్నారు. అందుకే ఈ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకెంత పెరుగుతాయో అర్థం కావట్లేదు.

గిల్ విధ్వంసం.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గుజరాత్ టైటాన్స్‌తో ఢీకొంటోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత, KKR కెప్టెన్ అజింక్య రహానె ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడ. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇచ్చి KKR బౌలర్లకు చెమటలు పట్టించారు. 10 ఓవర్లలో, ఇద్దరూ వికెట్ కోల్పోకుండా 89 పరుగులు సాధించారు. గిల్ కేవలం 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్ బాది 52 రుగులు చేశాడు. 13వ ఓవర్‌లో సాయి సుదర్శన్ 52 పరుగుల వద్ద ఔటవడంతో గుజరాత్‌కు తొలి దెబ్బ తగిలింది. గిల్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్సులతో 90 పరుగులు చేసి 18వ ఓవర్లో ఔటయ్యాడు. బట్లర్ మ్యాచ్ చివరలో మెరుపులు మెరిపించాడు. 23 బంతుల్లో 8 ఫోర్లు బాది 41 పరుగులు సాధించాడు. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 199 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

US: హార్వర్డ్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం.. ట్రంప్ సర్కార్‌పై దావా

అగ్ర రాజ్యం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం...

Off The Record: గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ సరికొత్త గేమ్ ప్లాన్ మొదలుపెట్టిందా..?

Off The Record: గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీజేపీ సరికొత్త గేమ్‌ మొదలుపెట్టిందా?...

Supreme Court: మురికివాడలు కూల్చి విఐపిల కోసం రోడ్లు వేస్తారా..

ఏపీ అధికారి హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పై సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు...

Off The Record: నిమ్మల రామానాయుడుకు సొంత సెగ్మెంట్ లో కొత్త కష్టం

Off The Record: ఆ మంత్రిగారికి పోలీసులు అస్సలు సహకరించడం లేదా?...