9
April, 2025

A News 365Times Venture

9
Wednesday
April, 2025

A News 365Times Venture

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Date:

నిరాహార దీక్ష విరమించిన రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లెవాల్..

సీనియర్ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ 131 రోజుల తర్వాత ఆదివారం నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరలపై (MSP) చట్టపరమైన హామీని, రైతుల డిమాండ్లపై ఆయన గత ఏడాది నవంబర్ 26న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆదివారం రోజున ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌లో జరిగిన రైతులు సమావేశంలో నిరాహార దీక్ష విరమించే నిర్ణయాన్ని ప్రకటించారు. దల్లెవాల్ ప్రసంగిస్తూ.. ‘‘మీరందరూ ఆమరణ నిరాహార దీక్ష విరమించమని నన్ను కోరారు. ఆందోళనలో జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు నేను రుణపడి ఉంటా. మీ మనోభావాలను గౌరవిస్తాను. మీ ఆదేశాన్ని అంగీకరిస్తున్నాను’’ అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్, కేంద్ర రైల్వే సహాయమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ప్రకటన వెలువడింది. శనివారం దల్లెవాల్ తన నిరాహార దీక్ష విరమించాలని వారు కోరారు.

కాలేజ్‌లో స్పీచ్ ఇస్తూనే.. గుండెపోటులో మరణించిన 20 ఏళ్ల విద్యార్థిని..

ఇటీవల కాలంలో ఉన్నట్లుండి యువత గుండెపోటుకు గురవుతోంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారు ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఓ కాలేజీ విద్యార్థిని స్పీచ్ ఇస్తూనే కుప్పకూలి ప్రాణాలు వదిలింది. 20 ఏళ్ల విద్యార్థిని వర్ష ఖరత్ ప్రసంగం మధ్యలో నవ్వుతూ కనిపించింది. ప్రసంగిస్తూనే, హార్ట్ ఎటాక్ రావడంతో మరణించింది. ఈ ఘటన ధరాశివ్ నగరంలో జరిగింది. ఒక కార్యక్రమంలో గుండెపోటు రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పరాండ తాలూకాలోని మహర్షి గురువర్య ఆర్జీ షిండే మహావిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో వర్ష ఖరత్ మరాఠీలో ప్రసంగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రసంగానికి ప్రేక్షకులు నవ్వడం ప్రారంభించారు. ప్రసంగంలోనే ఆమె నెమ్మదిగా నేలపై కుప్పకూలింది. వెంటనే ప్రేక్షకులు ఆమెను వైద్యం కోసం తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

మూవర్స్ అండ్ ప్యాకర్స్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్

ప్యాకర్స్ అండ్ మూవర్స్ పేరిట ఇంటి సామాన్లను తరలిస్తున్నట్లు బిల్డ్ అప్ ఇచ్చి, వాస్తవానికి భారీగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం నాడు ఓ ఆర్ ఆర్ వద్ద ఈ స్మగ్లింగ్ బస్తీ బట్టబయలైంది. ఈ ఘటన వివరాలను సైబరాబాద్ డీసీపీ కోటిరెడ్డి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, బోయిన్‌పల్లికి చెందిన ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తనకు ఉన్న బొలెరో వాహనాన్ని ప్యాకర్స్ అండ్ మూవర్స్ పనులకు ఉపయోగిస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన సన్నీ అనే వ్యక్తి డ్రైవర్‌గా, మనీష్ కుమార్ హెల్పర్‌గా చేరారు.

సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ.. ఆయన నేపథ్యం ఇదే..

సీపీఎం పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల బేబీ సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. తమిళనాడు మధురైలో జరిగిన సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్‌లో ఎంఏ బేబీని పార్టీ చీఫ్‌‌గా ఎన్నుకున్నారు. కేరళ నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు. అంతకుముందు కేరళ మొదటి ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాల్ సీపీఎంకు నాయకత్వం వహించారు. గతేడాది సీతారాం ఏచూరి మరణం తర్వాత ఈ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా ప్రకాష్ కారత్ పదవిని నిర్వహిస్తున్నాడు. మైనారిటీ కమ్యూనిటీ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నేతగా బేబీ రికార్డ్ సృష్టించారు.

భద్రాచలంలో ఘనంగా రాములోరి కళ్యాణం.. భారీగా ట్రాఫిక్ జాం

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన రాముల వారి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపధ్యంలో భద్రాచలం పట్టణం వాహనాలతో కిక్కిరిసిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, మూడు గంటలకుపైగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభిజిత్ లగ్నం సమయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. దీన్ని వీక్షించేందుకు టెంపోలుగా, బస్సులుగా, కార్లుగా, ద్విచక్ర వాహనాలుగా భక్తులు సమీప ప్రాంతాల నుండి పెద్దఎత్తున భద్రాచలానికి వచ్చారు. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడి భద్రాచలం ప్రధాన రహదారులు మొత్తం నిలిచిపోయినట్టయ్యాయి.

ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరుతూ పీయూష్ గోయల్‌కు లేఖ

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగానికి అండగా నిలవాలని కోరుతూ లేఖ రాశారు. ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి.. రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తుందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరారు. భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా దేశ ప్రభుత్వం 27 శాతం దిగుమతి సుంకం విధించింది.

ఇటీవల అదృశ్యమైన ఫైనాన్సర్‌ స్వప్నం సింగ్‌ దారుణ హత్య

ముషీరాబాద్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు అయిన వ్యక్తి స్వప్నం సింగ్ (59) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల నాలుగో తేదీన అల్వాల్ నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పిఎస్ లో 0 ఎఫైర్ నమోదు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అల్వాల్ లో నివాసం ఉండే స్వప్నం సింగ్ తన సోదరుడు హరిదీప్ సింగ్ ను ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని గాంధీనగర్ దేవి చౌక్ ప్రాంతంలో వదిలివేయడానికి ఈనెల నాలుగో తేదీన వచ్చి బోయగూడా లో తెలిసిన వారి ఇంటికెళ్లి దారుణ హత్యకు గురై సంపులో శవం అయి తేలాడు.

దారుణం.. శ్రీలీలను అక్కడ పట్టుకుని లాగిన ఆకతాయిలు..

స్టార్ హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ఆకతాయిలు లాగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. శ్రీలీల ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. అక్కడ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ లవ్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక తాజాగా డార్జిలింగ్ లో షూటింగ్ కోసం మూవీ టీమ్ అక్కడకు వెళ్లింది. అక్కడ ఓ చోట షూటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తుండగా.. వారిని చూసేందుకు అభిమానులు వచ్చారు. వారి మధ్యలో నుంచి కార్తీక్ అభివాదం చేసుకుంటూ వస్తున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jagadish Reddy: వాళ్లు తెలంగాణ నీళ్లను దొంగిలించుకుని పోతున్నారు..

Jagadish Reddy: తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి...

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

రాజధాని ప్రాంతంలో సీఎం కొత్త ఇంటికి శంకుస్థాపన.. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎంతో...

Online Love: ఆన్‌లైన్ ప్రేమికుడి కోసం ఏపీ వచ్చిన అమెరికా యువతి

ఆన్‌లైన్ ప్రేమికుడి కోసం అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో అనే యువతి...

Kakkireni Bharath Kumar: యువతకు ఆదర్శంగా యువ ఆంత్ర ప్రెన్యూర్.. భరత్ కుమార్ కక్కిరేణి!

Kakkireni Bharath Kumar: మీరు చేయగలిగిన అత్యుత్తమ పెట్టుబడి మీలోనే ఉంది.....