16
February, 2026

A News 365Times Venture

16
Monday
February, 2026

A News 365Times Venture

Tollywood : టాలీవుడ్‌లో సెన్సార్ సెగ.. మారుతున్న సినిమాల టైటిల్స్..’హే భగవాన్’ కాస్తా ‘హే బలవంత్’

Date:

సినిమా ప్రమోషన్లన్నీ ఒక పేరుతో పూర్తి చేసుకున్నాక, సరిగ్గా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే సమయంలో టైటిల్ మార్చాల్సి రావడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా యంగ్ హీరో సుహాస్ నటించిన సినిమా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. కేవలం సుహాస్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో మరికొన్ని చిన్న సినిమాలు కూడా సెన్సార్ అబ్జెక్షన్స్ వల్ల పేర్లు మార్చుకున్నాయి.

Also Read : Tollywood : సంగీత దర్శకుల విషయంలో అయోమయంలో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్

 సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం ‘హే భగవాన్’. ఈ నెల 20న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుడి పేరుతో ఉన్న టైటిల్ వల్ల కొన్ని వర్గాల సెంటిమెంట్స్ దెబ్బతినే అవకాశం ఉందని భావించిన బోర్డు, పేరు మార్చాలని సూచించింది. దీంతో మేకర్స్ చేసేదేమీ లేక చివరి నిమిషంలో టైటిల్‌ను హే బలవంత్!’  గా మార్చారు. ప్రమోషన్లన్నీ పాత పేరుతోనే జరగడంతో ఈ మార్పు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.

Also Read : Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి సినిమాలో గెస్ట్ రోల్ లో ‘సిద్దు జొన్నలగడ్డ’ & ‘కీర్తి సురేష్’

ఇటీవల విడుదలైన వానర చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ చిత్రంలో కుల రాజకీయాలు మరియు సున్నితమైన అంశాలు ఉండటం, టైటిల్ ఏమో హనుమంతుడిని గుర్తు చేసేలా ఉండటంతో సెన్సార్ బోర్డు నో చెప్పింది. దీంతో ఈ సినిమాను ‘వనవీర’ పేరుతో విడుదల చేయాల్సి వచ్చింది. ప్రమోషన్ల కోసం ఖర్చు పెట్టిన డబ్బు, టైటిల్ రీచ్ అంతా వృథా అయిందని ఆ చిత్ర దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే శివ కందుకూరి నటించిన ‘చాయ్ వాలా సినిమాకు కూడా సెన్సార్ కష్టాలు తప్పలేదు. ఈ టైటిల్ వాడకూడదని బోర్డు పట్టుబట్టడంతో, చిత్ర యూనిట్ తమ వర్కింగ్ టైటిల్ అయిన ‘నవాబ్ కేఫ్’ను ఖరారు చేసింది. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ ఎమోషనల్ డ్రామా ఫిబ్రవరి 20న కొత్త పేరుతో థియేటర్లలోకి రానుంది. చిన్న సినిమాలకు టైటిల్ అనేది బ్రాండింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమయంలో సెన్సార్ బోర్డు నిబంధనలు చిన్న నిర్మాతలకు భారంగా మారుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rajpal Yadav Bail: బాలీవుడ్‌ నటుడికి మధ్యంతర బెయిల్.. రూ.1.5 కోట్ల డిపాజిట్‌ సహా కఠిన షరతులు..

Rajpal Yadav Bail: చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు...

Thorrur Municipality: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత..

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలుపొందిన వారు ఇవాళ ప్రమాణ...

Sangareddy: పోలీస్ వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టిన లారీ.. జోగిపేట ఎస్సైకి స్వల్ప గాయాలు

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ (మం) సరాఫ్ పల్లి వద్ద పోలీస్ వాహనాన్ని...

Polimera 3 : పొలిమేర 3 అప్‌డేట్.. ఈసారి ట్విస్ట్ మామూలుగా లేదు!

ఓటిటిలో చిన్న సినిమాగా విడుదలై, తన సబ్జెక్టుతో పెను సంచలనం సృష్టించిన...