11
February, 2026

A News 365Times Venture

11
Wednesday
February, 2026

A News 365Times Venture

TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..

Date:

TGTET Results : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. గత నెలలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET-2026) ఫలితాలను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను , స్కోర్ కార్డ్‌లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లేదా https://tgtet.aptonline.in లో చెక్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 10న ఫలితాలు రావడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Amazon సమ్మర్ ధమాకా..! రూ.23,000 Samsung ఫ్రిజ్ ఇప్పుడు కేవలం రూ.15,000 కే..!

ఈ ఏడాది టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,95,181 (82.09%) మంది పరీక్షలకు హాజరయ్యారు. జనవరి 3 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షల్లో ఇన్-సర్వీస్ టీచర్లు (ప్రస్తుతం పనిచేస్తున్న వారు) అత్యధికంగా 90.27 శాతం మంది హాజరై తమ సత్తా చాటారు. మొత్తం అభ్యర్థులలో సుమారు 1,00,270 మంది (51.37%) అర్హత సాధించినట్లు ప్రాథమిక సమాచారం. కేటగిరీల వారీగా చూస్తే జనరల్ అభ్యర్థులకు 60%, బీసీలకు 50%, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 40% కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొనడంతో ఫలితాల విడుదలపై ఒకట్రెండు రోజులు జాప్యం జరుగుతుందని అంతా భావించారు. కానీ, ఎన్నికల కోడ్ , ఇతర కారణాల ప్రభావం లేకుండా విద్యాశాఖ అనుకున్న సమయానికే ఫలితాలను వెల్లడించి అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించింది. క్వాలిఫై అయిన అభ్యర్థులకు అందజేసే ‘టెట్ సర్టిఫికేట్’ జీవితకాలం (Lifetime) చెల్లుబాటు అవుతుంది. తదుపరి జరగబోయే ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో (DSC) ఈ టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు అభ్యర్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకం కానున్నాయి.

ఫలితాలు చూసుకోవడం ఎలా?

  • అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో ‘Results’ లేదా ‘Score Card’ లింక్ పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్ (లేదా జర్నల్ నంబర్) , పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.

boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య...

AR Rahman : టాలీవుడ్‌లో రెహమాన్ సెకండ్ ఇన్నింగ్స్.. ‘పెద్ది’ మ్యూజిక్ తెచ్చిన క్రేజ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా...

Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్‌లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు

Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా...