22
March, 2026

A News 365Times Venture

22
Sunday
March, 2026

A News 365Times Venture

TGSWREIS : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Date:

TGSWREIS : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలకు ఎన్ఐఎన్ సహకారం అందించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆహార భద్రతతో పాటు నాణ్యత ప్రమాణాలను పెంపొందించేందుకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (జాతీయ పోషకాహార సంస్థ) సహకారం తీసుకుంటోంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (TGSWREIS) అధ్వర్యంలో రాష్ట్రంలో 268 రెసిడెన్షియల్ విద్యాసంస్థలున్నాయి. వీటిలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రతిరోజు భోజనంతో పాటు స్నాక్స్ ను అందించే కామన్ డైట్ ప్రోగ్రాం ను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది.

 Realme P1 5G: క్రేజీ ఆఫర్.. రూ. 21 వేల రియల్ మీ 5G ఫోన్ రూ. 13 వేలకే!

రాష్ట్రంలో ఇటీవల కొన్ని చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కొన్ని చోట్ల ఆహార నాణ్యత లోపించిందని ఫిర్యాదులు రావటంతో ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్ఐఎన్ సహకారంతో ఆహార భద్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంపొందించాలని నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు సరుకుల సరఫరా, ఆహారం తయారీ, వడ్డించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని పారదోలేందుకు డైట్ మెనూ, వంట పద్ధతుల్లో నాణ్యత లోపించకుండా నిర్ణీత ప్రమాణాలు పాటించాలని నిర్ణయించింది. వంట గదితో పాటు, స్టోర్ రూమ్, భోజనం వడ్డించే చోట నిర్దిష్టమైన పద్ధతులను (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) అనుసరించాలని సూచించింది. ఆహార నాణ్యత ప్రమాణాలతో పాటు సిబ్బంది పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ రూపొందించేందుకు ప్రభుత్వం ఎన్ఐఎన్ సహకారం కోరింది. వీటితో పాటు సిబ్బందికి తగిన శిక్షణ మాడ్యూల్ ను అభివృద్ధి చేయాలని కోరింది.

Ponguleti Srinivas Reddy : ఫామ్‌హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?

ఇరాన్ దేశం తన చరిత్రలోనే అత్యంత గరిష్ట విలువ కలిగిన ’10...

Land Mutation: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ భూముల మ్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక...

Redmi Smart TV MAX: 100-అంగుళాల స్క్రీన్, 4K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో.. రెడ్‌మి స్మార్ట్ టీవీ విడుదల

రెడ్‌మి తన 2026 స్మార్ట్ టీవీ లైనప్‌ను చైనాలో విడుదల చేసింది....