18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

Date:

తెలంగాణ బీజేపీలో నిధుల గోల్‌మాల్ గుసగుసలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ హైకమాండ్ భారీగా నిధులను పంపినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోవడమే కాకుండా, నిధుల వినియోగంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ పంపిన నిధులకు మరియు ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు, గెలిచిన వార్డులకు ఏమాత్రం పొంతన లేదని ఢిల్లీ నేతలు గుర్తించారు. ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా వార్డులను విభజించి భారీగా ఫండ్‌ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, పంపిన నిధులను కొందరు నేతలు తమ స్వప్రయోజనాల కోసం ‘బొక్కేశారని’, అభ్యర్థులకు సరైన సమయంలో నిధులు అందలేదని సమాచారం అందడంతో హైకమాండ్ సీరియస్ అయింది.

Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

ఈ నిధుల గోల్‌మాల్‌పై ఇప్పటికే ఒకటి రెండుసార్లు పోస్ట్‌మార్టం నిర్వహించిన రాష్ట్ర బీజేపీ ఇన్-ఛార్జ్ అభయ్ పాటిల్, ఇప్పుడు లోతైన దర్యాప్తునకు ఆదేశించారు. నిధులు పక్కదారి పట్టిన విషయంలో ఏం చేయాలనే దానిపై ఆయన సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ విచారణ కోసం ప్రత్యేకంగా కొందరు నేతలను ఎంపిక చేసి, ఒక్కో జిల్లాకు ఒక్కో నేతను పంపనున్నారు. పార్టీ నియమించిన ఈ నేతలు నేరుగా గ్రౌండ్ లెవల్‌లోకి వెళ్లి, పోటీ చేసిన అభ్యర్థులతో మాట్లాడనున్నారు. వారికి పార్టీ నుంచి అందిన డబ్బులు ఎన్ని? ఆ వార్డు ఏ కేటగిరీలో ఉంది? నిధుల పంపిణీలో పద్ధతి ప్రకారం జరిగిందా లేదా? వంటి అంశాలపై వీరు ఆరా తీయనున్నారు.

నివేదిక అందిన తర్వాత బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అభయ్ పాటిల్ భరోసా ఇచ్చారు. కేవలం నిధుల విషయమే కాకుండా, పార్టీ శిక్షణ తరగతులు ఎలా జరుగుతున్నాయి మరియు పార్టీ క్రమశిక్షణ వంటి అంశాలపై కూడా పూర్తిస్థాయి రిపోర్టులను అధిష్టానం కోరినట్లు సమాచారం. ఈ నివేదికల అనంతరం తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Amla Murabba: తెల్ల జుట్టుకు చెక్.. మెరిసే చర్మానికి కేరాఫ్ అడ్రస్.. అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ ఇదే!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు...

Regina Cassandra: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

తెలుగులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి...

Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫ్రాన్స్ పర్యటనకు వచ్చారు. అయితే మెలోనికి...

Donald Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్..

Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చలు ఇస్లామాబాద్...