Terrorist: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి విచారణలో కుల్గాంకు చెందిన ఇంతియాజ్ మహ్మద్ లష్కరే తోయిబా స్లీపర్ సెల్ సభ్యుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఉగ్ర దాడికి సంబంధించి జరిపిన దర్యాప్తులో ఇంతియాజ్ పాత్ర బయటపడిందని అన్నారు. విచారణ సమయంలో ఇంతియాజ్ లష్కర్ రహస్య స్థావరం గురించి తనకు తెలుసని ఒప్పుకున్నాడు.. ఆ తర్వాత అతను చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్లాం.. అప్పుడు మా దగ్గర నుంచి తప్పించుకోవడానికి వైషో వాగులోకి దూకి కొట్టుకుపోయాడు.. ఆ తర్వాత కొద్దీ దూరంలో అహ్మద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.
Read Also: Srisailam Temple: శ్రీశైలం మల్లన్న ఆలయం హుండీలో చోరీ.. ఇద్దరు మైనర్లు సహా నలుగురి అరెస్ట్..!
అయితే, మృతుడు అహ్మద్ కుటుంబం సభ్యులు మాత్రం పోలీసుల వాదనను తీవ్రంగా ఖండించారు. ఇంతియాజ్ ను అధికారులు కస్టడీలో హత్య చేశారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. ఈ సంఘటన అనేక అనుమానాలను లేవనెత్తుతోందని అన్నారు. ఒక్క హింసాత్మక చర్య మొత్తం వ్యవస్థను కుదిపేస్తుందన్నారు.. ఏకపక్ష అరెస్టులు, ఇళ్లను కూల్చివేయడం, అమాయక పౌరులను నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. మరోవైపు, అహ్మద్ నివాసాన్ని సందర్శించిన రాష్ట్ర క్యాబినెట్ మంత్రి సకినా ఇటూ.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసు రికార్డులలో మృతుడిపై ఎటువంటి నేరం లేదని తేలిందన్నారు. అసలు నిజం బయటకు రావాలంటే న్యాయ విచారణ జరగాలన్నారు.
#KulgamUpdate | Imtiyaz Ahmad Magray (23), who had confessed knowledge of terrorist hideouts, died by suicide after jumping into Vishaw Nallah while guiding forces to a second hideout near the river. Legal proceedings underway, sources confirm. pic.twitter.com/mgW1eOPojK
— Tejinder Singh Sodhi (@TejinderSsodhi) May 4, 2025