పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది? పహల్గావ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల మరణం అనంతరం జమ్మూకశ్మీర్ సరిహద్దులో విస్తృతమైన పాకిస్థాన్ కార్యకలాపాలు చేస్తోందని వదంతులను ప్రచారం చేస్తున్నారు. పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన విమానాలు సరిహద్దు సైనిక స్థావరం వైపు వెళుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
READ MORE: AP SSC Results 2025: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
పాకిస్థాన్ తన ప్రధాన విమానాలను జమ్మూ కాశ్మీర్‌కు దగ్గరగా ఉన్న భారత సరిహద్దుకు సమీపంలోని స్థావరాలకు తరలిస్తోందనే వాదనలతో సోషల్ మీడియా నిండిపోయింది. పాకిస్థాన్ వైమానిక దళం (PAF) యొక్క ప్రధాన విమానాలు కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తరాన ఉన్న స్థావరాల వైపు బయలుదేరుతున్నట్లు చూపించే ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24 నుంచి తీసిన స్క్రీన్‌షాట్‌లు ఎక్స్‌లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
READ MORE: Pakistan : ఆ ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు: పాక్ రక్షణ మంత్రి
సోషల్ మీడియా వినియోగదారులు తమ పోస్ట్‌లలో పాకిస్థాన్ సైన్యం తరలించిన రెండు నిర్దిష్ట విమానాలను హైలైట్ చేశారు. మొదటిది PAF198. ఇది ఒక లాక్‌హీడ్ C-130E హెర్క్యులస్ రవాణా విమానం. రెండవది PAF101. ఇది ఒక చిన్న ఎంబ్రేర్ ఫెనోమ్ 100 జెట్. PAF101ను వీఐపీల కోసం, నిఘా కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. అయితే.. ఈ వార్తలపై ఇటు భారత్, అటు పాకిస్థాన్ నుంచి అధికారిక ధృవీకరణ రాలేదు.