జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే.. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
READ MORE: CM Chandrababu: టీడీపీ నేత వీరయ్య చౌదరి అంత్యక్రియలలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు!
తాజాగా ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉగ్రవాదులు సైతం సైనిక దుస్తుల్లో రావడంతో అసలైన భారత సైనికులను చూసి జనాలు భయాందోళనకు గురయ్యారు. వీడియో ప్రకారం.. స్థానికులు గాయపడిన ఓ మహిళ, ఓ బాలుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకొస్తున్నారు. సురక్షిత ప్రాంతంలో భారత సైనికులు వారికి రక్షణగా ఉన్నారు. ఆర్మీ యూనిఫాంలో ఉన్న అసలైన సైనికులను చూసి ఆ బాలుడు ఒక్కసారిగా ఆరవడం మొదలు పెట్టాడు. ఆదే యూనిఫాంలో వచ్చిన ఉగ్రవాదులు కళ్లముందే తండ్రిని దారుణంగా కాల్చిచంపడాన్ని చూసిన బాలుగు భయంతో అరిచాడు. దయచేసి మమ్మల్ని వదిలేయండి.. నా కొడుకును చంపొద్దు.. అంటూ ఆ తల్లి ప్రాథేయపడింది. దీంతో అక్కడున్న సైనికులు మేము అసలైన సైనికులం, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాం.. అని సమాధానం ఇచ్చారు. నా భర్తను చంపేశారు అన్నా అంటూ ఆ మహిళ రోదనలు చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.
READ MORE: Delhi Capitals: ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. భావోద్వేగ పోస్ట్..
కాగా.. కశ్మీర్‌లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోయారు.
Watch how the child screams in terror seeing the army men in Pahalgam… the terrorists were dressed in military fatigues. His father was shot dead before his eyes. pic.twitter.com/CYgzwp502J
— Akshita Nandagopal (@Akshita_N) April 23, 2025