15
August, 2026

A News 365Times Venture

15
Saturday
August, 2026

A News 365Times Venture

Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!

Date:

Termite-Proof Furniture: ఇంట్లో చెక్క ఫర్నిచర్, అల్మారాలు, కిచెన్ క్యాబినెట్లు, టీవీ యూనిట్లు ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే చాలామంది ఇంటిని నిర్మించేటప్పుడు లేదా ఇంటీరియర్ చేయించేటప్పుడు వీటికి ప్రత్యేకంగా ఉండాలని ఆలోచిస్తారు. సాధారణంగా ఫర్నిచర్ తయారు చేయించే సమయంలో డిజైన్, రంగు, ధర వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. అయితే వీటితో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అదే చెదలు. అవును మీరు చదివింది నిజమే..

చెదలు చెక్కను లోపలి నుంచి నెమ్మదిగా తినేస్తాయి. బయటకు ఫర్నిచర్ బాగానే కనిపించినప్పటికీ, లోపల మాత్రం పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చెదల సమస్య మరింత పెరుగుతుంది. సమస్య బయటకు కనిపించే సమయానికి చెక్కకు అప్పటికే భారీ నష్టం జరిగి ఉండొచ్చు. అందుకే కేవలం ఫర్నిచర్‌పై యాంటీ-టెర్మైట్ కోటింగ్ చేయించడం కంటే.. మొదటి నుంచే చెదలు, తేమ ప్రభావం తక్కువగా ఉండే మెటీరియల్‌ను ఎంచుకోవడం మంచిది. అల్మారాలు, కిచెన్ క్యాబినెట్లు, వార్డ్‌రోబ్‌లు, షూ క్యాబినెట్లు, టీవీ యూనిట్ల కోసం చెక్క బదులు ఈ మెటీరియల్స్ వాడితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

అల్యూమినియం క్యాబినెట్లు:

చెదల సమస్య అసలు ఉండకూడదనుకునేవారికి అల్యూమినియం క్యాబినెట్లు బెస్ట్ ఛాయస్. చెక్కలో ఉండే సెల్యులోజ్ చెదలకు ఆహారంగా మారుతుంది. అయితే అల్యూమినియంలో సెల్యులోజ్ ఉండదు. అంతేకాకుండా చెక్క మాదిరిగా తేమను పీల్చుకోదు. అందువల్ల కిచెన్ క్యాబినెట్లకు అల్యూమినియం మంచి ఆప్షన్‌గా ఉంటుంది. వంటగదిలో రోజూ నీరు, ఆవిరి, తేమకు క్యాబినెట్లు గురవుతుంటాయి. కాబట్టి చెక్క క్యాబినెట్లతో పోలిస్తే అల్యూమినియం క్యాబినెట్లకు తేమ కారణంగా దెబ్బతినే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాదండోయ్.. అల్యూమినియం క్యాబినెట్లను శుభ్రం చేయడం సులభం. ఇవి తేలికగా ఉండటంతో పాటు మన్నికగా కూడా ఉంటాయి. స్టయిలిష్ ఇంటీరియర్‌కు సరిపోయేలా వివిధ డిజైన్లలో తయారు చేయించుకోవచ్చు కూడా. అయితే క్యాబినెట్ మన్నిక కేవలం మెటీరియల్‌పై మాత్రమే ఆధారపడదు. అల్యూమినియం నాణ్యత, ఫ్రేమ్, హింజీలు, ఫిట్టింగ్ వంటి అంశాలు కూడా భాగమే.

పీవీసీ ఫోమ్ బోర్డ్:

చెక్కలా కనిపించే ఫర్నిచర్ కావాలి.. అలాగే చెదల సమస్యను తగ్గించుకోవాలనుకుంటే పీవీసీ ఫోమ్ బోర్డ్ కూడా మరో ఆప్షన్ . ఇది చెక్కతో పోలిస్తే తేమ వల్ల తక్కువగా దెబ్బతింటుంది. వివిధ రంగులు, డిజైన్లు, ఫినిష్‌లలో అందుబాటులో ఉండటంతో ఇంటీరియర్‌కు అనుగుణంగా ఉంటుంది. పీవీసీ ఫోమ్ బోర్డ్‌పై హై-ప్రెజర్ లామినేట్ ఉపయోగిస్తే అదనపు రక్షణ లభించవచ్చు. దీంతో చెక్కను పోలిన ఫినిష్ కూడా పొందవచ్చు. కిచెన్ క్యాబినెట్లు, వార్డ్‌రోబ్‌లు, టీవీ యూనిట్లు, షూ క్యాబినెట్లకు ఈ మెటీరియల్‌ను ఉపయోగించవచ్చు. అయితే బోర్డు నాణ్యత, మందం, ఫిట్టింగ్, అంచుల సీలింగ్ వంటి అంశాలను కూడా తప్పకుండా పరిశీలించాలి.

ట్రీటెడ్ హార్డ్‌వుడ్:

మీకు సహజమైన చెక్క లుక్, ఫీల్ కావాలంటే ట్రీటెడ్ హార్డ్‌వుడ్ ను ఎంచుకోవచ్చు. కొన్ని రకాల చెక్కల్లో సహజంగా ఉండే నూనెలు, ఇతర లక్షణాలు కొన్ని కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. సగ్వాన్ లేదా టీక్, మహోగని, సీడర్ వంటి చెక్కలను సాధారణంగా మన్నికైన వాటిగా పరిగణిస్తారు. అయితే ఏ చెక్కలోనూ ఎప్పటికీ చెదలు పట్టవని భావించడం తప్పని చెప్పాలి. చెక్క నాణ్యత, తేమ స్థాయి, ప్రాసెసింగ్, ట్రీట్‌మెంట్ వంటి అంశాలు చెదల నిరోధకతపై ప్రభావం చూపుతాయి. అందుకే హార్డ్‌వుడ్ ఉపయోగించేటప్పుడు సరైన యాంటీ-టెర్మైట్ ట్రీట్‌మెంట్‌తో పాటు అంచుల సీలింగ్‌పై కూడా దృష్టి ఉంచుకోవాలి.

కంపోజిట్ మెటీరియల్స్:

ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్‌లో వివిధ రకాల కంపోజిట్, ఇంజినీర్డ్ మెటీరియల్స్ కూడా బాగా ఉపయోగిస్తున్నారు. వివిధ పదార్థాలను కలిపి తయారు చేసే ఈ బోర్డులు కొన్ని సందర్భాల్లో సాధారణ చెక్కతో పోలిస్తే తేమ, కీటకాల ప్రభావాన్ని తట్టుకునేలా ఉంటాయి. కంపోజిట్ బోర్డుల్లో చెక్కను పోలిన గ్రెయిన్, వివిధ రంగులు, ఫినిష్‌లు అందుబాటులో ఉండటంతో స్టైలిష్ ఇంటీరియర్‌కు సరిపోతాయి. తేమ ప్రభావాన్ని తగ్గించడం, ఉబ్బిపోయే ప్రమాదాన్ని తగ్గించడం, శుభ్రం చేయడం సులభంగా ఉండటం వంటి ప్రయోజనాలు ఉంటాయి.

కిచెన్ మాత్రమే కాదు..

చెదల సమస్య కేవలం కిచెన్ క్యాబినెట్లకే పరిమితం కాదు. ఇంట్లో చెక్క లేదా చెక్క ఆధారిత బోర్డులు ఉపయోగించిన ప్రతిచోటా తేమ, సీలింగ్, మెటీరియల్ నాణ్యతపై శ్రద్ధ వహించాలి. బట్టలతో పాటు తేమ కూడా అల్మారాలో చేరితే చెక్కకు నష్టం కలగవచ్చు. ఇంకా షూ క్యాబినెట్ లో తడిగా ఉన్న షూల నుంచి వచ్చే తేమ చెక్కను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఫర్నిచర్ తయారు చేయించేటప్పుడు కేవలం అందం, ధరను మాత్రమే కాకుండా మెటీరియల్ నాణ్యత, తేమ నిరోధకత, చెదల నిరోధకత, సీలింగ్, ఇన్‌స్టాలేషన్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Supreme Court: “ఆంక్షలు విధించడానికి మీరెవరు?”.. నల్సార్‌ లా వర్సిటీ అంశంలో BCIకి సుప్రీంకోర్టు చురకలు..

Supreme Court: హైదరాబాద్‌లోని నాల్సార్ (NALSAR) న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్...

Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం

Census 2027: దేశంలో 2027 జనాభా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు...

AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!

AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది....

Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!

Indoor Plants:  ఇంట్లో పచ్చదనం ఉంటే ఆ వాతావరణమే మారిపోతుంది. కిటికీ...