2
June, 2026

A News 365Times Venture

2
Tuesday
June, 2026

A News 365Times Venture

Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..

Date:

తెలంగాణలోని ఆయిల్ పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ ఆయిల్ ఫెడ్ తీపి కబురు అందించాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆయిల్ పామ్ గెలల ధరను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. మే నెలకు గాను ఆయిల్ పామ్ గెలల ధరను గణనీయంగా పెంచుతూ తెలంగాణ ఆయిల్ ఫెడ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ నెల ధర టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.23,501 కాగా.. టన్నుకు రూ.351 పెరిగింది. పెరిగిన ధరతో కలిపి ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.23,852 కు చేరుకుంది.

రైతులకు ఆర్థిక భరోసా..
గత కొద్ది రోజులుగా పెట్టుబడి వ్యయం పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ధరల పెంపు పెద్ద ఊరటనిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పామాయిల్ ధరల్లో వస్తున్న మార్పులు, స్థానికంగా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఆయిల్ పామ్ గెలలకు అత్యధిక ధర లభిస్తుండటం విశేషం.

సాగు విస్తరణకు ఊతం..
ప్రభుత్వం అందిస్తున్న ఈ మద్దతు ధరల వల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు వైపు మరింత మంది రైతులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ పామ్ సాగు లాభదాయకంగా మారడంతో, రైతులు దీనిని ఒక సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారు. ప్రస్తుత ధరల పెంపుతో మే నెలలో దిగుబడిని ఫ్యాక్టరీలకు తరలించిన రైతులకు అదనపు లాభాలు చేకూరనున్నాయి. పెరిగిన ధరల ప్రకారం మే నెలలో గెలలు విక్రయించిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ఈ నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయిల్ పామ్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా...

Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?

Chairman’s Desk: దేశంలో మోడీ వరుసగా మూడోసారి అప్రతిహతంగా ప్రధానిగా కొనసాగుతున్నారు....

Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సోమవారం...