నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలోనే మరో ముందడుగు పడింది. మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ధ్యేయం చొరవతో టీం శివంగిని ఏర్పాటు చేశారు. అయితే.. టీం శివంగిని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు అన్నింటిలో ముందుండాలి అని ఎస్పీ జానకీ షర్మిల కృషి అమోఘమన్నారు. ఈ మధ్య మామడ చిట్టడవిలో తప్పిపోయిన నలుగురి ఆడవారిని వెతికి పట్టుకోవటం లో వీరు పడ్డ కష్టం అభినందనీయమని, రాష్ట్రం అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే శివాంగి టీం లు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. శిక్షణను కష్టం అనుకోకుండా ఇష్టం తో చేయాలని సూచించారు.
ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా లేనటువంటి కని విని ఎరుగని రీతిలో ఒక సరికొత్త ఆలోచనకు పునాది వేసి మహిళలు ఎక్కడ కూడా తక్కువ కాకూడదు అనే సదుద్దేశంతో, పురుషులతో పాటు సమానంగా సెలెక్టెడ్ ఉమెన్స్ కి 45 రోజుల కఠోర శిక్షణను అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ అన్నారు శివంగి టీం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తామన్నారు…
దేశంలోని త్రివిధ దళాలైనటువంటి ఆర్మీలో స్పెషల్ కమాండో ఫోర్స్ అని నావిలో మార్కోస్ కమాండోస్ అని ఇలా రక రకాలుగా అత్యుత్తమ ఫలితాలు ఇస్తున్నాయని, అలాగే స్పెషల్ కమాండోస్ గా NSG ల వలే SPG వలె మన రాష్ట్రం లో గ్రేహౌండ్స్ సత్ఫలితాలిస్తున్నారు. మన రాష్ట్రం లో ఇప్పటి వరకు ఎక్కడా కూడా మహిళా Commandos అనేవారు లేరు, కానీ గౌరవ నిర్మల్ జిల్లా ఎస్పీ విన్నూత్న ఆలోచనలతో ముందుకు వచ్చి జిల్లాలో మహిళ కమాండోస్ ను తయారు చేయడం జరిగిందన్నారు.. వారికి టీం శివంగీ గా నామకరణం చేసి కఠోర శిక్షణను ఇచ్చి, వాళ్ళని తెలంగాణ పోలీసులో అత్యాధునిక ఆయుధాలను వినూత్న రీతిలో వాడే విధంగా తీర్చిదిద్ది కఠోర శ్రమతో వారిని శివంగి టీమ్ గా జిల్లాకు పరిచయం చేయడం జరిహిందీ అన్నారు.. వారు కనబరిచిన ప్రతిభ తో మంచి సత్ఫలితాలను ఇవ్వాలనే ఉద్దేశం తో ఈ టీం ను తయారు చేయడం జరిగిందని, పురుష పోలీసు కానిస్టేబుల్ కు ధీటుగా వీరిని తయారు చేయడం జరిగిందని తెలిపారు..
ఈ శిక్షణలో భాగంగా మహిళలకు శారీరక దృఢత్వం,రన్నింగ్ రేసులు, vertical rope climbing, మనుగడ పద్ధతులు, యుద్ధ తంత్ర కళ యందు పోరాట నైపుణ్యాలు, పేలుడు పదార్థాల శిక్షణ మరియు అన్ని రకముల వెపన్ ట్రైనింగ్, ముఖ్యంగా అధునాతన టెక్నాలజీ తో కూడిన వెపన్ లను ఉపయోగించి ఫైరింగ్ చేయడం, వెపన్ హ్యాండ్లింగ్, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్ మరియు మ్యాప్ లేకుండా నావిగేట్ చేయడం,ఆకస్మిక వ్యూహాలు లక్ష్యసాధన,శత్రువుల కదలికలు అడవి సంకేతాలను చదవడం, నిఘా పద్ధతులు,ఆకస్మిక దాడి మరియు ఎదురు దాడి కసరత్తులు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం వంటివి నేర్పించారు అంతేకాకుండా ఒక్కొక్కరిని ఒక్కో విభాగం లో నిష్ణాతుల్ని చేయడం జరిగిందన్నారు…కొంతమంది యుద్ద తంత్ర కళ యందు నైపుణ్యం,మరి కొంతమంది ఫీల్ సిగ్నల్స్ నందు ఇంకొంతమంది ఫైరింగ్ యందు మరి కొంతమంది నిఘా వ్యవస్థ యందు కఠోర శిక్షణ ఇచ్చి వారిని ఆయా విభాగాల యందు నిష్ణాతులుగా ఒక స్పెషల్ టీం గా తయారు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు.
Vijayawada: ఎంబీబీఎస్ విద్యార్థులు మాల్ ప్రాక్టీసు వ్యవహారంపై నివేదిక సిద్ధం..