14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

Tapan Deka: మరో ఏడాది కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు..!

Date:

Tapan Deka: కేంద్ర ప్రభుత్వం నేడు (మే 20)న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ పొడిగింపు 2025 జూన్ 30 తర్వాత ప్రారంభమై 2026 జూన్ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటుంది. తపన్ కుమార్ డేకా 1988 బ్యాచ్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2022 జూలై 1న ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు, ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ముఖ్యంగా కౌంటర్-టెర్రరిజం విభాగంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. 2008 ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Read Also: Looting bride: 25 మందిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీ.. దోచుకుని పారిపోవడం ఇమె స్టైల్..

దేశీయ భద్రత మరియు ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆయన అనుభవం, నైపుణ్యం దేశ భద్రతకు కీలకంగా మరీనా నేపధ్యంలో ఈ పొడిగింపు నిర్ణయం, ప్రభుత్వానికి ఆయనపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పొడిగింపు, ప్రస్తుత విధాన నిబంధనలు అయిన FR 56(d), Rule 16(1A) ప్రకారం కేంద్రానికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి “ప్రజా ప్రయోజనం” కోణంలో మంజూరు చేయబడింది. తపన్ కుమార్ డేకా‌కు ఉగ్రవాదం, మౌలికవాదంపై సుదీర్ఘ అనుభవం ఉంది. పాకిస్తాన్‌లో మూలాలు ఉన్న ఉగ్రవాద ఘటనలపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఆయన, ఇటీవలే ఫహల్గాం ఉగ్రదాడి వంటి ఘటనల సందర్భంలో ఇండియా చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” వంటి ప్రతిచర్యలతో సంబంధం కలిగివున్నారు.

Read Also: Marriage Scam: భాగ్యనగరంలో పెళ్లి పేరుతో మాయ లేడీలు.. తస్మాత్ జాగ్రత్త..!

తపన్ డేకా ఉత్తరాదిన రాష్ట్రాలే కాకుండా.. ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న అనుభవం ఉన్న అధికారి. జమ్మూ కాశ్మీర్‌లో వచ్చిన అనేక సంక్షోభాలను పరిష్కరించడంలో కేంద్రానికి అతను ముఖ్యమైన సంప్రదింపుల వ్యక్తిగా నిలిచారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

అద్దె కారు తీసుకున్నారు.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు.. మధ్యలో ఓ కన్నింగ్...

Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు...

Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

కాలేయం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం. ఇది విషతుల్యాలను తొలగించడం,...

Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..

రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తుకు భద్రతను ఇస్తాయని చాలామంది...