గత కొంతకాలంగా తమన్నా భాటియా, విజయ్ వర్మ గాఢమైన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కాని ఇది మూడునాళ్ళ ముచ్చట గానే మిగిలిపోయింది. తర్వాత వీరు ఇద్దరు విడిపోయ్యారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ వాలంటైన్స్ డే నాడు విజయ్ వర్మ చేసిన ఒక పోస్ట్ వీరిద్దరి బ్రేకప్‌ను కన్ఫామ్ చేసినట్లు కనిపిస్తోంది. విజయ్ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక గుర్తు తెలియని యువతితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..
Also Read : Supritha : మా కన్నీళ్లతో వ్యాపారం చేస్తున్నారు.. సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!
“ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ఫరెవర్” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో తమన్నాతో బంధానికి ముగింపు పలికి, విజయ్ కొత్త ప్రేమాయణం మొదలుపెట్టాడని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్ కావడంతో మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలో ఒక చిన్న ట్విస్ట్ కూడా వినిపిస్తోంది. విజయ్ వర్మ ఆ ఫోటోను ట్యాగ్ చేసిన అకౌంట్ ఒక ఒరిజినల్ వ్యక్తిది కాదని, అది ఏదో ప్రాంక్ లేదా బ్రాండ్ ప్రమోషన్ అయి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. మొదట సీరియస్‌గా తీసుకున్న నెటిజన్లు, ఆ అకౌంట్ డీటెయిల్స్ చూశాక ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని లైట్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా, తమన్నా-విజయ్ బంధంపై వస్తున్న ఈ పుకార్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.




