11
March, 2026

A News 365Times Venture

11
Wednesday
March, 2026

A News 365Times Venture

Suryakumar Yadav: కోచ్-కెప్టెన్ మ్యాజిక్.. గంభీర్ గేమ్ ఛేంజర్‌ సలహా.. మ్యాచ్ గెలిపించిన సూర్య

Date:

Suryakumar Yadav: నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. చిన్న టీంపై భారత్ టీమ్ కొంత గదరగోళానికి గురైంది. ఎట్టకేలకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్‌ను గెలిపించాడు. ఇన్నింగ్స్ మధ్యలో కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యతో మాటాడాడు. ఎంతో ధైర్యం నింపాడు. ఈ మ్యాచ్ గెలిచిన తరువాత సూర్యకుమార్ కోచ్ గంభీర్ గేమ్ ఛేంజర్ నిర్ణయాన్ని సూర్యకుమార్ వివరించారు.

READ MORE: Love Marriage Tragedy: ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం.. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి..?

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడుతోంది. ప్రత్యర్థి జట్టు అమెరికా. మ్యాచ్ మొదట అంతా బాగానే కనిపించింది. కానీ కాస్త సమయం గడిచేలోపే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం 12.4 ఓవర్లకే భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. స్టేడియంలో నిశ్శబ్దం. డ్రెస్సింగ్ రూమ్‌లో టెన్షన్. అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. అలాంటి కష్ట సమయంలో క్రీజ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఆరో ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకు మొదట పరుగులు రావడం చాలా కష్టంగా మారింది. తొలి 13 బంతుల్లో కేవలం 7 పరుగులే వచ్చాయి. మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఒత్తిడి పెరుగుతోంది. కానీ సూర్య ముఖంలో మాత్రం భయం కనిపించలేదు. ఇన్నింగ్స్ మధ్యలో కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యతో మాట్లాడాడు. “ఇది 180 లేదా 190 పరుగుల వికెట్ కాదు. చివరి వరకు నిలబడి ఆడు. పరుగులు చివర్లో వస్తాయి” అని గంభీర్ ధైర్యం చెప్పాడు. ఆ మాటలు సూర్యకు చాలా బలంగా నిలిచాయి. తాను ముంబై మైదానాల్లో ఇలాంటి పిచ్‌లపై ఆడిన మ్యాచ్‌లు సంగతి సూర్యకు గుర్తొచ్చింది. తనపై తనకు నమ్మకం పెరిగింది. అమెరికా బౌలర్ శుభమ్ రంజన్ ఓవర్‌లో సూర్య కొన్ని మంచి షాట్లు ఆడాడు. అదే ఓవర్‌లో సూర్య క్యాచ్ మిస్ అయ్యింది. అమెరికాకు అదే పెద్ద తప్పదంగా మారింది.

READ MORE: Love Marriage Tragedy: ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం.. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి..?

లైఫ్ రావడంతో సూర్య ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఒక్కో బంతికి ధైర్యం తెచ్చుకున్నాడు. నిదానంగా ప్రారంభించి వేగంగా పరుగులు చేయడం మొదలు పెట్టాడు. టీమ్ స్కోర్ కూడా నెమ్మదిగా ముందుకు సాగింది. 36 బంతుల్లో సూర్య అర్ధశతకం పూర్తి చేశాడు. చివరి ఓవర్లలో అయితే అసలు సిసలైన సూర్య కనిపించాడు. చివరి ఓవర్ వేసిన సౌరభ్ నేత్రవాల్కర్‌ను చీల్చి చెండాడాడు. ఆ ఓవర్‌లోనే 21 పరుగులు వచ్చాయి. నేత్రవాల్కర్ నాలుగు ఓవర్లలో 65 పరుగులు ఇచ్చాడు, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్‌లలో ఒకటిగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో నాటౌట్‌గా 84 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. అతని పోరాటం వల్ల భారత్ 20 ఓవర్లలో 161/9 స్కోర్ చేయగలిగింది. ఒక దశలో అసాధ్యంగా కనిపించిన స్కోర్ అది. తర్వాత బౌలర్లు మంచి ప్రదర్శన చేయడంతో భారత్ 29 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన సూర్య.. “77/6 వద్ద చాలా ఒత్తిడి ఉంది. కానీ నేను చివరి వరకు ఆడితే ఏదైనా జరగొచ్చని నమ్మాను. గౌతీ భాయ్ చెప్పిన మాటలు నాకు చాలా ధైర్యం ఇచ్చాయి” అన్నాడు. అదే మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో సూర్య మరో రికార్డు కూడా సాధించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత కెప్టెన్‌గా ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్. అలాగే కెప్టెన్సీ డెబ్యూలో వచ్చిన రెండో అతిపెద్ద స్కోర్ కూడా ఇదే. ఈ రికార్డులో అతనికంటే ముందు ఉన్నది ఒక్క క్రిస్ గేల్ మాత్రమే. 2009లో ఆస్ట్రేలియాపై గేల్ చేసిన 88 పరుగులు ఇంకా టాప్‌లో ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌‌కు సీరియస్.. సీక్రెట్ ప్లేస్‌కు మోజ్తాబా!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియమితులయ్యారు. ఈ...

IPL 2026: క్రికెట్ ఫాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ఫస్ట్ మ్యాచ్‌లో కీలక మార్పు.. ఈ రెండు టీమ్‌ల మధ్యే తొలి పోరు!

IPL 2026 Schedule: క్రికెట్ అభిమానులకు కిక్ ఎక్కిచ్చే న్యూస్ వచ్చేసింది....

PM Modi: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. దేశంలో ఇంధన సంక్షోభంపై ప్రధాని మోడీ క్లారిటీ!

PM Modi: మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది....