18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

Suryakumar Yadav: “గంభీర్ కాదు.. నన్ను కెప్టెన్ చేసింది ఈ నలుగురే”.. కెప్టెన్సీ వెనుక అసలు కథ చెప్పిన సూర్య

Date:

Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్పు2026లో భారత్ అదరగొట్టింది. సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా జట్టు అద్భుత ప్రదర్శన సాగించింది. ముచ్చటగా మూడోసారి కప్పు గెలిచిన టీమిండియా జట్టు అరుదైన రికార్డు సృష్టించింది. అయితే.. ఈ సీజన్ అనంతరం ఓ ఇంటర్య్వూలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ తర్వాత సూర్యకుమార్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ వల్లే సూర్యకు జట్టు పగ్గాలు దక్కాయనే వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఈ అంశంపై తాజాగా సూర్య స్పందించాడు. గంభీర్ కంటే మరో నలుగురి పాత్ర చాలా కీలకమని వెల్లడించాడు. ముందు మరో నలుగురు కీలక వ్యక్తులు ఉన్నారని సూర్య స్పష్టం చేశారు. “బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలే నన్ను కెప్టెన్‌గా ప్రమోట్ చేశారు. వీళ్లే ప్రధాన పాత్ర పోషించారు. శ్రీలంక సిరీస్‌కు మూడు నాలుగు రోజుల ముందు జై షా తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. అయితే ఈ నిర్ణయం వెనుక రోహిత్, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్‌ల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందే ఈ ప్రణాళిక సిద్ధమైంది.” అని కెప్టెన్ సూర్య వెల్లడించాడు.

READ MORE: US-Iran War: హార్ముజ్ వద్ద అమెరికా బిగ్ ఆపరేషన్.. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్

కెప్టెన్‌గా సూర్యకుమార్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. తాజాగా వచ్చిన ట్రోఫీతో సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న మూడవ భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ చారిత్రాత్మక విజయంతో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక ప్రధాన రికార్డును సృష్టించాడు. ఫైనల్లో విజయంతో, సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20ఐ కెప్టెన్‌గా కూడా నిలిచాడు. ఇప్పుడు అతను అత్యధిక విజయ శాతాన్ని కలిగి ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 52 టీ20ఐ మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అతను వీటిలో 42 మ్యాచ్‌లలో గెలిచాడు. 8 మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయాడు, రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. అంటే అతని కెప్టెన్సీలో, టీమ్ ఇండియా 80.77% మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇది ప్రపంచంలోని అన్ని కెప్టెన్లలో అత్యధికం. ముఖ్యంగా, సూర్యకుమార్ యాదవ్ గతంలో అత్యంత విజయవంతమైన టీ20ఐ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను అధిగమించాడు. అతని కెప్టెన్సీలో, భారత జట్టు 80.65 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. రోహిత్ 62 మ్యాచ్‌లలో 50 విజయాలు సాధించగా, టీం ఇండియా 12 మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో, పాకిస్తాన్ 78.38 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

OnePlus 15T: కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్...

Delhi: అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం .. ఏడుగురు మృతి.!

Delhi: న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో నేడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం...

Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!

Indore: ఇండోర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ...

Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!

Parents Smoking: చాలా విషయాలలో వారి తల్లితండ్రుల అలవాట్లు పిల్లలపై ఎంతో...