26
October, 2026

A News 365Times Venture

26
Monday
October, 2026

A News 365Times Venture

Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Date:

Surprise For Delivery Boy: సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. కష్టపడి పనిచేసే బ్లింకిట్ (Blinkit) డెలివరీ వర్కర్ సుజీత్‌కు కొత్త స్కూటీని బహుమతిగా అందించిన దృశ్యాలు నెటిజన్ల కళ్లను చెమ్మగిల్లేలా చేస్తున్నాయి. కుటుంబ పోషణ కోసం సుజీత్ రోజూ సైకిల్‌పైనే ప్రజల ఇళ్లకు సరుకులను డెలివరీ చేసేవాడు. అలాంటి వ్యక్తికి ఒక్కసారిగా కొత్త స్కూటీని బహుమతిగా ఇవ్వడంతో అతడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నిర్వాహకులు మొదట సుజీత్ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత కళ్లగంతలు తీసి చూడమని కోరారు. కళ్లు తెరిచి ఎదురుగా ఉన్న సరికొత్త స్కూటీని చూడగానే అతడి ఆశ్చర్యానికి, ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖంలో ఆశ్చర్యం, ఒకింత భావోద్వేగం స్పష్టంగా కనిపించాయి. ఆ క్షణంలో అతడి ప్రతిస్పందన నెటిజన్ల హృదయాలను హత్తుకుంది.

సామాజిక మాధ్యమాల్లో లభించిన సమాచారం ప్రకారం.. ఈ సర్‌ప్రైజ్‌ను సామాజిక కార్యకర్త హుస్సేన్ మన్సూరి ఏర్పాటు చేశారు. వీడియోలో ఆయన సుజీత్‌తో కలిసే కనిపించారు. అయితే పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ తరఫున ఈ స్కూటీని బహుమతిగా అందించినట్లు మన్సూరి పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. “డబ్బు ఉండటం ఒక ఎత్తయితే, నిస్సహాయ స్థితిలో ఉండి శ్రమిస్తున్న ఒక వ్యక్తి జీవితంలో ఆనందాన్ని నింపి వారి ముఖంలో చిరునవ్వు చూడటం మరొక విషయమని” ఆ పోస్టులో రాసుకొచ్చారు. సుజీత్ పడిన శ్రమ, పడ్డ కష్టాల దృష్ట్యా ఈ బహుమతి అతడి జీవితానికి ఎంతో ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సుజీత్ హావభావాలు చూసి తమ కళ్లలో నీళ్లు తిరిగాయని పలువురు కామెంట్లు చేయగా.. మరికొందరు అనంత్ అంబానీ సమాజసేవ, ఆయన నిర్వహిస్తున్న వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్ట్ ‘వంతారా’ను ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. ఆపదలో ఉన్నవారికి, కష్టపడేవారికి సహాయం చేయడమే మనిషికి గొప్ప లక్షణమని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బ్లింకిట్, జొమాటో వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్డర్ తీసుకునే రోజువారీ డెలివరీ వర్కర్లకు తోచినంత మేర టిప్ రూపంలో సహాయం చేయాలని పలువురు యూజర్లు విజ్ఞప్తి చేశారు. శ్రమజీవుల కష్టాన్ని గుర్తించి అందించిన ఈ బహుమతి ఇంటర్నెట్‌లో వేలాది మంది హృదయాలను గెలుచుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..

Kharge Controversy:  కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో...

Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!

Temple Style Daddojanam: దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే దద్దోజనం ఎంతో కమ్మగా,...

IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!

IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల...