7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

Super Six Schemes: ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. వారికి నేరుగా అకౌంట్లోకి రూ.2,500..

Date:

తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ప్రకటించిన ఈ ఆరు గ్యారెంటీలు అధికార DMK, ప్రతిపక్ష AIADMK శిబిరాల్లో గుబులు రేపుతున్నాయి. కేవలం సినిమా గ్లామర్‌తోనే కాకుండా.. బలమైన సంక్షేమ అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఉమెన్స్ డే సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న విజయ్.. ఈ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు.

Also Read:Israel: లెబనాన్ “శ్మశాన వాటిక”లో వెతుకుతున్న ఇజ్రాయిల్.. దీని వెనక ఓ పైలట్ త్యాగం..

విజయ్ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఇవే..

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మినహా.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 నేరుగా వారి ఖాతాల్లో జమ.రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు పూర్తి ఉచిత ప్రయాణ సౌకర్యం. పాఠశాల విద్యను ప్రోత్సహించేందుకు బాలికలకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. మహిళల భద్రత కోసం ప్రత్యేక ‘మహిళా పోలీస్ విభాగం’ ఏర్పాటు. పేద కుటుంబాలకు ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం.  మహిళలపై జరిగే నేరాలను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టుల’ ఏర్పాటు.

Also Read:Surya Kumar Yadav: బిగ్‌షాక్.. రేపు రిటైర్‌మెంట్ ప్రకటించనున్న సూర్యకుమార్ యాదవ్..!?

ప్రస్తుతం తమిళనాడులో ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలులో ఉన్నప్పటికీ, విజయ్ ప్రకటించిన రూ. 2,500 నగదు బదిలీ , ఉచిత సిలిండర్ల హామీలు మధ్యతరగతి, పేద వర్గాలను ఆకర్షించే అవకాశం ఉంది. ‘మార్పు కావాలి’ అని కోరుకునే యువతతో పాటు.. ఇప్పుడు మహిళా శక్తిని కూడా తనవైపు తిప్పుకోవడం ద్వారా విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నారు. ద్రవిడ రాజకీయాల కోటలో విజయ్ వేస్తున్న ఈ అడుగులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..

PM Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ...

CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ...

Interest Rates Cut: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన ఖాతాదారులకు భారీ ఊరటనిస్తూ కీలక...

Preity Zinta: వరుసగా ఆస్తులు అమ్మేస్తున్న ప్రీతీ జింటా.. ఎందుకంటే ?

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింటా ముంబై...