16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

Stock Market Rise: స్టాక్ మార్కెట్ ఈ రోజు సడన్‌గా పెరగడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..

Date:

ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 16) భారీ లాభాలతో ముగిసింది. గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు, ఈరోజు కోలుకుని ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్.. 938.93 పాయింట్లు (1.26 శతం) పెరిగి 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 257.70 పాయింట్లు (1.11 శాతం) లాభపడి 23,408.80 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో ఈరోజు 1,410 షేర్లు లాభపడగా.. 2,772 షేర్లు నష్టపోయాయి. 157 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) 2.9 శాతం పెరిగింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా 1 శాతం మేర లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఏకంగా 4.22 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్, ఎస్‌బీఐ కూడా మంచి లాభాలను సాధించాయి. ఇక సన్ ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి.

Also Read:Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

మార్కెట్ పుంజుకోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది.. తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు. గత కొన్ని రోజులుగా మార్కెట్లు పడిపోవడంతో.. మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు వాటిని కొనేందుకు ఆసక్తి చూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల షేర్లకు మంచి డిమాండ్ కనిపించింది. మార్కెట్‌లో ఆందోళనను సూచించే ‘ఇండియా విక్స్’ (VIX) 5 శాతం మేర తగ్గింది. ఇది మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి తగ్గుతుందని చెప్పడానికి ఒక సంకేతం. అయితే మార్కెట్‌లో ఇంకా కొంత ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Also Read:Free Urea: తెలంగాణ రైతులకు అదిరే శుభవార్త.. ఉచితంగా యూరియా పంపిణీ..!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. సముద్ర మార్గంలో చమురు రవాణాకు ఆటంకం కలగకుండా దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయన్న వార్త మార్కెట్‌కు బలాన్నిచ్చింది. మన దేశానికి చెందిన రెండు గ్యాస్ నౌకలు (శివాలిక్, నందాదేవి) క్షేమంగా భారత్‌కు వస్తుండటం ఇంధన సరఫరాపై ఆందోళనలను తగ్గించింది.  మార్కెట్ ఈరోజు పెరిగినప్పటికీ.. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ 23,500 పైన స్థిరపడితేనే మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ మార్కెట్ మళ్ళీ తగ్గడం ప్రారంభిస్తే 22,800 స్థాయి వరకు వెళ్లే ప్రమాదం ఉందని కోటక్ సెక్యూరిటీస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వారం నిఫ్టీ 22,000 నుంచి 24,000 మధ్య ట్రేడ్ కావచ్చని అంచనా.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

హమ్మయ్య.. చాలా రోజుల తర్వాత నష్టాలకు బ్రేక్ పడ్డాయి. దేశీయ మార్కెట్‌లో...

Governor Shiv Pratap Shukla: రైతు భరోసా నుంచి మహాలక్ష్మి వరకు.. సంక్షేమ పథకాలపై గవర్నర్ మార్క్ ప్రసంగం..!

Governor Shiv Pratap Shukla: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు...

B-1B Lancer: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి అమెరికా B-1B లాన్సర్!

B-1B Lancer: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా తన...

Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య!

Hyderabad: హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెల్ని పిండేసే...