20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

Date:

హమ్మయ్య.. దేశీయ మార్కెట్ తెప్పరిల్లింది. నిన్న భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. 24 గంటల్లోనే వేగంగా కోలుకుంది. శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. ప్రస్తుతం అన్ని రంగాలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. హార్ముజ్ కోసం ఐరోపా, జపాన్ దేశాలు ఏకమయ్యాయి. ఇరాన్‌తో కలిసి సమస్యను పరిష్కరిస్తామని సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో మార్కెట్‌కు సరికొత్త ఊపు వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 839 పాయింట్లు లాభపడి 75, 046 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 260 పాయింట్లు లాభపడి 23, 362 దగ్గర కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92.94 దగ్గర రికార్డ్ కనిష్టానికి పడిపోయింది.

నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రధాన లాభాల్లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిండాల్కో, ఒఎన్‌జీసీ నష్టపోయాయి. పవర్, పీఎస్‌యు బ్యాంక్, ఐటీ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం చొప్పున పెరగడంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Iran-Israel War: హార్ముజ్‌ కోసం ఏకమైన 6 దేశాలు.. నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తున్నాయి. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనం అయ్యాయి. అయితే ఆశ్చర్యంగా ఈ వారం ప్రారంభంలో మూడు రోజులు జోరుగా లాభాలు వచ్చాయి. ఇంతలోనే ఖతార్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ భీకర దాడులు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు ధరలు పెరిగిపోతాయన్న భయాందోళనలు రేకెత్తడంతో నిన్న మార్కెట్ ఢమాల్ అయింది. నిన్న ఒక్కరోజే 7 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మొత్తంగా గత 20 రోజుల యుద్ధంగా కారణంగా ఇప్పటి వరకు 37 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.

ఇది కూడా చదవండి: Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Dhurandhar 2: ధురందర్ 2 లో ఊహించని క్లైమాక్స్‌.. పార్ట్ 3 ఉంటుందా?

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ ఏవైటెడ్ సీక్వెల్ ‘ధురందర్:...

Netanyahu: ఇరాన్ అణుశక్తిని నాశనం చేశాం.. పుకార్ల మధ్య నెతన్యాహు ప్రెస్‌మీట్

ఇరాన్‌తో యుద్ధంలోకి అమెరికాను తాము నెట్టలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు....

Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి కథ ఇది. తన...

Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

తెలంగాణ గడ్డపై కళలకు, కళాకారులకు అత్యున్నత గౌరవం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర...