SRH vs MI: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ ఆరంభంలో తడబడినప్పటికీ హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్‌ల బ్యాటింగ్ తో చెప్పుకోతగ్గ స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ (MI) ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.
ఇక బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు ఆరంభం నుంచి ఎదురుదెబ్బలే ఎదురయ్యాయి. జట్టు కేవలం 13 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ట్రావిస్ హెడ్ (0), ఇషాన్ కిషన్ (1), అభిషేక్ శర్మ (8), నితీష్ కుమార్ రెడ్డి (2) వరుసగా నిరాశపరిచారు. అయితే ఈ పరిస్థితుల్లో హేన్రిచ్ క్లాసెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపించాడు. అతను 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేయగా, అతనికి అబినవ్ మనోహర్ (43) మంచి సహకారం అందించాడు.
ఇక ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసుకున్నాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు.. బుమ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ సాధించారు. SRH ఈ మ్యాచ్‌లో ఓ అవసరంలేని రికార్డును తన పేరున చేసుకుంది. పవర్ ప్లేలో కేవలం 24 పరుగులు మాత్రమే చేసి ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరు చేసిన జట్లలో ఒకటిగా నిలిచింది.