SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభమన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో జట్టు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇకపోతే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (8 పరుగులు) తొలి ఓవర్ లోనే ఔటయ్యాడు. అనంతరం అభిషేక్ శర్మ (18), ఇషాన్ కిషన్ (17) కూడా చక్కటి స్టార్ట్ ఇచ్చినా ఎక్కువ కాలం క్రీజులో నిలవలేకపోయారు. మధ్య ఓవర్లలో నితీష్ కుమార్ రెడ్డి (31 బంతుల్లో 34), హైన్రిచ్ క్లాసెన్ (27 పరుగులు, 19 బంతుల్లో) జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (9 బంతుల్లో 22 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్స్) విజృంభనతో చెప్పుకోతగ్గ స్కోర్ చేశారు. మహమ్మద్ షమీ (6 నాటౌట్) కూడా చివర్లో కాన్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. ప్రారంభంలోనే 3 వికెట్లు త్వరగా కోల్పోయిన SRH, మధ్యలో కొంత మెరుగుదల చూపింది కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం మూలంగా పరిమిత స్కోరుకే పరిమితమయ్యింది.
Read Also: Honda Hness CB350: మూడు వేరియంట్లలో వచ్చేసిన కొత్త హోండా హ్నెస్ CB350
ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్లలో మోహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. ఆ తర్వాత ప్రసిద్ క్రిష్ణా, సాయి కిషోర్ 2 వికెట్లు తీయడంతో SRH బ్యాటింగ్‌పై ఒత్తిడి పెట్టారు. ఈ ముగ్గురు బౌలర్లు SRHని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. చూడాలి మరి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ స్కోర్ లోపల గుజరాత్ ను నిలువరిస్తుందో లేక మరో ఓటమిని ఎదురుకుంటుందో.