Somireddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంకును కొల్లగొట్టిన మెహుల్ ఛోక్సిని బెల్జియంలో అరెస్టు చేశారు.. ఉగ్రవాదానికి ఊతమిచ్చిన తహావుర్ రాణాను కూడా అరెస్ట్ చేసి విదేశాల నుంచి పట్టుకొచ్చారు.. కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం దొరకడం లేదు.. వీరిద్దరి కంటే ఘనుడు కాకాణి.. పోలీసుల కళ్ళు కప్పడంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు అని ఆరోపించారు. కాకాణి ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు.. జగన్ కూడా అరెస్ట్ అయ్యే జైలుకు వెళ్లాడు కానీ కాకాణి మాత్రం దొరకడం లేదన్నారు. పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అతడు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు.. దోపిడీలు దొంగతనాలు తప్పుడు కేసులు పెట్టించడంలో కాకాణి నెంబర్ వన్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Tollywood Actress : హీరోయిన్స్ కెరీర్ కు విలన్స్ గా మారుతున్న యంగ్ హీరోలు
ఇక, వైసీపీ ప్రభుత్వ హయాంలో నాపై 17 కేసులు పెట్టారు అని టీడీపీ నేత చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వాటిని ధీటుగా ఎదుర్కుంటా.. కాకాణి గోవర్ధన్ రెడ్డి తప్పు చేయలేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దోపిడీదారుని వెనకేసుకొనిరావడం సరికాదు అన్నారు. ఇలాంటి వ్యక్తిని జిల్లా అధ్యక్షునిగా పెట్టడం సిగ్గుచేటు.. రుస్తుం మైన్స్ లో వందల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపించారు. బెదిరింపులకు, కేసులకు భయపడను అని ప్రగల్భాలు పలికారు.. పోలీసులు వచ్చి అరెస్టు చేసుకోవచ్చని చెప్పారు.. తీరా పోలీసులు నోటీసులు ఇవ్వడంతో పారిపోయాడు.. గతంలో నాకు విదేశాలలో ఆస్తులు బ్యాంకు ఖాతాలో ఉన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు.. అప్పుడు కూడా కాకాణి పారిపోయాడు.. ఇప్పుడు కూడా పారిపోయాడు అని పేర్కొన్నారు. కాకాణి కోసం ఆరు బృందాలు వెతుకుతున్నాయి.. ఇలాంటి పిరికిపంద.. పట్టపగలు దోపిడీ చేసే దొంగకు వైసీపీ ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు వత్తాసు పలకడం ఎంత వరకూ సబబు అన్నారు. కాకాణికి దమ్ము, ధైర్యం ఉంటే పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకుని విచారణకు హాజరు కావాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.