హైదరాబాద్‌లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసులపై సిట్ సోదాలు నిర్వహించింది. మద్యం స్కాంలో రాజ్ కసిరెడ్డి కోసం రేపు కూడా హైదరాబాద్‌లో సిట్ ఉండనుంది. ఇవాళ మూడు చోట్ల గాలించినా కసిరెడ్డి ఆచూకీ లభించలేదు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కసిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్టు సమాచారం అందటంతో సిట్ అక్కడకి వెళ్లినా ఫలితం లభించలేదు. కసిరెడ్డి భాగ్యనగరంలోనే ఉన్నారని పక్కా సమాచారం అందటంతో మరో 2 రోజులు గాలింపు చర్యలు చేపట్టాలని సిట్ నిర్ణయం తీసుకుంది. తనిఖీల నేపథ్యంలో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు సభ్యులతో సమావేశమయ్యారు. సిట్ దర్యాప్తుపై టీం సభ్యులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
READ MORE: YSRCP: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్..
మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా రాజ్ కసిరెడ్డి పాత్ర కీలకమని సిట్ అధికారులు ముందునుంచీ భావిస్తున్నారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ, కసిరెడ్డి స్పందించలేదని, విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కుంభకోణం వెనుక ఉన్న మరింత మంది కీలక వ్యక్తుల వివరాలు రాబట్టాలంటే కసిరెడ్డి విచారణ అత్యంత ముఖ్యమని దర్యాప్తు అధికారులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
READ MORE: YSRCP: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్..
ఈ నేపథ్యంలో మద్యం స్కాం కేసులో రాజ్ కసిరెడ్డికి మరో సారి సిట్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 19లోపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికీ మూడు సార్లు నోటీసు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. సిట్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో కసిరెడ్డి పిటిషన్ వేయగా కోర్టు డిస్మిస్ చేసింది. విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు.