21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..

Date:

SIR: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియలో భాగంగా వీవీఐపీలు నోటీసులు అందుకున్నారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితా సమరణలో ప్రముఖుల పేర్లు ఉండటం సంచలనంగా మారింది. వీరందరికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆయన భార్య క్యోకో శంకర్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందాయి.

జైశంకర్, ఆయన భార్య పేర్లను గత SIR జాబితాతో అనుసంధానం చేయలేకపోవడంతో ‘‘అన్ మ్యాప్డ్ విత్ లాస్ట్ SIR’’(Unmapped with Last SIR” )కేటగిరీలో చేర్చారు. వీరిద్దరూ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుందర్ బాగ్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా నమోదై ఉన్నారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన భార్య వనిత సూద్, తల్లి కమలేష్ సూద్‌లకు కూడా ఇదే కేటగిరీలో నోటీసులు అందాయి. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఆయన భార్య సునీత ద్వివేదిలకు ‘‘అన్‌మ్యాప్డ్ విత్ లాస్ SIR’’ కేటగిరీలో నోటీసులు వచ్చాయి.

వీరిలో పాటు సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ భార్య షీనా బ్రిటాన్, కుమారుడు ఆనంద్ బ్రిటాస్‌కు మాత్రం వేర్వేరు కారణాలతో నోటీసులు ఇచ్చారు. షీనా బ్రిటాస్‌కు ‘‘సెల్ఫ్ నేమ్ మిస్ మ్యాచ్’’, ఆనంద్ బ్రిటాస్‌కు ‘‘పేరెంట్ నేమ్ మిస్ మ్యాచ్’’ కింద నోటీసులు అందాయి.

అన్ మ్యాప్డ్ అంటే ఏమిటి..?

SIR ప్రక్రియలో ప్రస్తు ఓటర్ వివరాలను గతంలో నిర్వహించిన ఓటర్ల జాబితాలతో సరిపోల్చి చూస్తారు. పాత జావబితాలో ప్రస్తుత రికార్డును అనుసంధానం చేయలేకపోయిన ఓటర్లను ‘‘అన్ మ్యాప్డ్’’ కేటగిరీలో గుర్తిస్తారు. ఢిల్లీ SIRలో ఇలాంటి తేడాలను గుర్తించిన ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాలని కోరుతున్నారు. పేర్లు, పుట్టినరోజు తేదీ, ఇతర వివరాల్లో వ్యత్యసాలు ఉన్నా పరిశీలన జరుగుతుంది. నోటీసులు రావడం అంటే పేరు ఓటర్ జాబితా నుంచి తొలగించినట్లు కాదు. సంబంధిత పత్రాలను సమర్పించి తన వివరాలను ధ్రువీకరించుకునే ప్రక్రియలో భాగం.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..

భారత క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు...

TGPSC Syllabus Changes: సిలబస్‌ మార్పులపై TGPSC కీలక ప్రకటన..

TGPSC Syllabus Changes: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సిలబస్‌...

SIR Notice: ఎల్‌కే అద్వానీకి SIR నోటీసులు..

ఎన్నికల సంఘం ఢిల్లీలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సంచలనంగా...

Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..

రంజీ ట్రోఫీ రాబోయే సీజన్‌కు సంబంధించి హైదరాబాద్ జట్టు తొలి రెండు...