లోక్‌సభ మాజీ ఎంపీ, బీజేపీ నేత, సూఫీ గాయకుడు హన్స్ రాజ్ భార్య రేషమ్ కౌర్(62) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం ఆమె దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఆమె తుది శ్వాస విడిచారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రేషమ్ కౌర్ సోదరుడు పరంజిత్ సింగ్ వెల్లడించారు. ఆమెకు భర్త హన్స్‌రాజ్, ఇద్దరు కుమారులు యువరాజ్ హన్స్, నవరాజ్ హన్స్ ఉన్నారు.
గురువారం సఫీపూర్‌లో అంత్యక్రియలు జరుగుతాయని పరంజిత్ సింగ్ తెలిపారు. మధ్యాహ్నం 1 ఒంటి గంటకు జలంధర్‌లోని ఠాగూర్ ఆస్పత్రిలో రేషమ్ కౌర్ చనిపోయినట్లు పేర్కొన్నారు. కౌర్ మృతి పట్ల కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, శిరోమణి అకాలీదళ్ నాయకుడు దల్జిజ్ సింగ్ సంతాపం తెలిపారు. హన్స్ రాజ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫరీద్‌కోట్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
తన తల్లితో సరాదాగా గడిపిన వీడియోను కుమారుడు గతేడాది యువరాజ్ హన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన తల్లి ఎప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. పిల్లల పట్ల తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఈ వీడియోనే ఉదాహరణ అని పేర్కొన్నారు.
View this post on Instagram