3
April, 2026

A News 365Times Venture

3
Friday
April, 2026

A News 365Times Venture

Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

Date:

Shroud Of Turin: ఏసు క్రీస్తుకు సంబంధించిన ‘‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’’ మూలాలు భారతదేశంలో ఉన్నాయా?, ఏసు క్రీస్తుకు శిలువ వేసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన శరీరంపై కప్పడానికి ఉపయోగించిన వస్త్రాన్ని ‘‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’’గా వ్యవహరిస్తుంటారు. ఈ లెనిన్ వస్త్రం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక డీఎన్ఏ అధ్యయనంలో షాకింగ్ విషయాలు తెలిశాయి.

పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన జియానీ బార్కాసియా నేతృత్వంలోని పరిశోధకులు, 1978లో ‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’ నుండి సేకరించిన నమూనాలను అధునాతన DNA సీక్వెన్సింగ్ పద్ధతులను ఉపయోగించి తిరిగి పరీక్షించారు. ఈ రీసెర్చ్‌లో వస్త్రంపై మొక్కలు, జంతువులు, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులకు సంబంధించిన డీఎన్ఏ ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. పరిశోధకుల ప్రకారం, ఈ వస్త్రంలో కనిపించిన డీఎన్ఏలో సుమారు 40 శాతం భారతీయ వంశాలకు చెందినదిగా గుర్తించారు. దీని ఆధారంగా ఈ వస్త్రం భారత్‌లోని సింధూ లోయ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. రోమన్లు ఈ వస్త్రాన్ని భారత్ నుంచి తీసుకువచ్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..

1354లో ఫ్రాన్స్‌లో మొదటిసారిగా ఈ వస్త్రం గురించిన వివరాలను నమోదు చేశారు. ఇది 14.44 అడుగుల పొడవు, 3.61 అడుగుల వెడల్పు ఉంది. దీనికి సంబంధించిన రహస్యాలు ఇప్పటికీ పరిశోధకులకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఇటలీలోని ట్యూరిన్ లో ఉన్న సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ కేథడ్రల్‌లో భద్రపరిచిన ఈ వస్త్రం, భారత్ నుంచి వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు.

ఈ వస్త్రం శతాబ్ధాలుగా అనేక విభిన్న ప్రాంతాల్లో తిరిగిన కారణంగా దీనిపై పిల్లులు, కుక్కలు, జింకలు, కుందేళ్లు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, గుర్రాలతో సహా అనేక జంతువుల డీఎన్ఏను గుర్తించారు. క్యారెట్లు, మిరపకాయలు, గోధుమల వంటి మొక్కల డీఏన్ఏ కూడా ఉంది. క్యూటిబాక్టీరియం, స్టెఫిలోకాకస్‌తో సహా మానవ చర్మ బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణాల వల్ల ఈ వస్త్రానికి చెందిన ప్రాథమిక డీఎన్ఏను ఖచ్చితంగా గుర్తించడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

Liquor Sales: తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగం మునుపెన్నడూ లేని విధంగా...

US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన రక్షణ మంత్రి.. అమెరికా సైన్యంలో భారీ కుదుపు

US Army Chief Fired: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన...

Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఇక ఎక్కడికీ కదలబోదంటూ అమరావతిలో...

HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

సిటీ లైఫ్ అనగానే గుర్తుకువచ్చేది ట్రాఫిక్, పొల్యూషన్.. అలాంటిది ఇప్పుడు సిటీలో పచ్చదనం...