4
July, 2026

A News 365Times Venture

4
Saturday
July, 2026

A News 365Times Venture

Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్‌గా రికార్డ్..

Date:

Shreyas Iyer: ఇంగ్లాండ్‌తో డర్హామ్‌ వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ రద్దయినప్పటికీ మొదటి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై టీ20 ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీ (అర్ధ శతకం) నమోదు చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. సరికొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయ్యర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో అతను 48 బంతుల్లో 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు, ఇంగ్లాండ్ వేదికగా ఓ పురుషుల టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా నమోదైన అత్యధిక స్కోరు కూడా ఇదే. ఈ క్రమంలో అతను లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2018లో కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్‌పై కోహ్లీ చేసిన నాటౌట్ 47 పరుగులే ఇప్పటివరకు భారత కెప్టెన్‌కు ఉన్న అత్యధిక స్కోరు.

ఇటీవలే ఐర్లాండ్ చేతిలో 0-2తో షాకింగ్ సిరీస్ ఓటమిని చవిచూసిన టీమిండియాను, ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. మొదటి రెండు ఓవర్లలోనే ఓపెనర్లు సంజూ శామ్సన్‌, ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరడంతో భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపించాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ 27 బంతుల్లోనే 59 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడగా, అయ్యర్ మాత్రం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 82 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. మొదట్లో కాస్త ఓపికగా ఆడిన అయ్యర్, ఆ తర్వాత గేర్ మార్చి క్లాస్ బౌండరీలు, ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఒక భారీ సిక్సర్‌తో కేవలం 38 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ (lbw)గా వెనుతిరిగినప్పటికీ, అప్పటికే భారత్‌కు ఓ పటిష్టమైన పునాది లభించింది. చివర్లో శివమ్ దూబే 42 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 189/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఫలితం తేలనప్పటికీ, మంచెస్టర్‌లో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి ఫామ్‌లోకి రావడం, ఒక అరుదైన మైలురాయిని అందుకోవడం భారత జట్టుకు ఓ పెద్ద సానుకూలాంశం అని చెప్పాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! “లెక్కలు చెప్పండి.. చర్చకు రండి”

Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని...

AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు

AP Gold Mining: ఆంధ్రప్రదేశ్‌లో బంగారు ఖనిజ నిక్షేపాల గుర్తింపు, తవ్వకాలపై...

Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?

Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో...