13
July, 2026

A News 365Times Venture

13
Monday
July, 2026

A News 365Times Venture

Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్

Date:

Shreyas Iyer: సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్‌ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గత మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు పడగా, అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్‌ జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్ పర్యటనలో మెరిసిన సూర్యవంశీకి ఈ ఇంగ్లాండ్ టూర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక మరో మార్పుగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ శెడ్గే తుది జట్టులోకి వచ్చాడు.

టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మార్పుల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. “సిరీస్ ఫలితం ఎలా ఉన్నా ఆటగాళ్లు తమ వంద శాతం శ్రమను పెట్టాలని కోరుకుంటున్నాను. గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాలను పక్కనపెట్టి, ప్రస్తుత క్షణంలో జీవిస్తూ ప్రశాంతంగా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే ముఖ్యం. జట్టు భవిష్యత్తుకు ఏది మంచిదనే కోణంలోనే వాషింగ్టన్ స్థానంలో సూర్యాంశ్, సూర్యవంశీ స్థానంలో సంజు శామ్సన్‌లను జట్టులోకి తీసుకున్నాం” అని అయ్యర్ వివరించారు.

అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు ఇంగ్లాండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. సామ్ కరన్, ఆదిల్ రషీద్‌ల అద్భుత బౌలింగ్ ధాటికి భారత్ 56 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో క్లీన్‌స్వీప్ చేసింది (తొలి మ్యాచ్ వర్షార్పణమైంది). డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాను ఇంగ్లాండ్ అన్ని రంగాల్లోనూ చిత్తు చేసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇప్పటివరకు భారత్‌కు కనీసం ఒక్క విజయం కూడా దక్కకపోవడం గమనార్హం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం

గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భక్తుల కళ్ల ముందే 11 ఏళ్ల...

Hyderabad: ఫిలింనగర్‌లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..

Hyderabad: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో తెల్లవారుజామున ఓ ఫెరారీ (Ferrari) స్పోర్ట్స్ కార్...

Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!

Visakhapatnam Earthquake: విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 5...

ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!

ICC T20 Ranking: అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న టీమిండియా...