గత ఏడాది బాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘స్త్రీ 2’ విజయంతో శ్రద్ధా కపూర్ ఇంకా ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు. ఈ సినిమా విడుదలై ఏడు నెలలు గడిచినా, ఈ బాలీవుడ్ అందాల తార నుంచి కొత్త సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ‘స్త్రీ 2’ ఘన విజయంతో ఆమెకు వచ్చిన క్రేజ్ అపారం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య నరేంద్ర మోడీ, ప్రియాంక చోప్రాలను మించిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన సినీ సెలబ్రిటీగా ఆమె మొదటి స్థానంలో నిలిచింది.
‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రద్ధా కెరీర్‌ను ఎవరూ ఆపలేరని అనుకుంటే, ఈ స్టార్ హీరోయిన్ మాత్రం నిదానంగా సమయం గడుపుతోంది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఆమె ప్రియుడితో సమయం గడిపేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ కెమెరాలకు చిక్కుతోంది తప్ప, కొత్త సినిమా ప్రకటన గురించి ఎలాంటి సూచన ఇవ్వడం లేదు.
Priyanka Jawalkar : ట్యాక్సీవాలా నుంచి మధ్యలోనే తీసేస్తారనుకున్నాః ప్రియాంక జవాల్కర్
రెండు నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో రెండు-మూడు సినిమాలకు కమిట్ అయినట్లు చెప్పినట్లు సమాచారం ఉన్నా, ఇప్పటివరకు అధికారికంగా ఏదీ నిర్ధారణ కాలేదు. ఆమెకు గతంలో హ్యాట్రిక్ హిట్స్ అందించిన దర్శకుడు మోహిత్ సూరితో సినిమా ఉంటుందని పుకార్లు వచ్చినా, ఇటీవల ఆ దర్శకుడు ఆ వార్తలను ఖండించారు. శ్రద్ధాతో చాలా కాలంగా మాట్లాడలేదని, ఆమెతో కలిసి పని చేసే ఆలోచన లేదని స్పష్టం చేయడంతో, వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘సాహో’ తర్వాత శ్రద్ధా మరో తెలుగు సినిమా చేయలేదు. ‘పుష్ప 2’లో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించగా, ఆమె భారీ మొత్తం కోట్ చేసి నిర్మాతలకు షాక్ ఇచ్చింది. దీంతో చిత్ర బృందం శ్రీలీలను ఎంచుకుంది. ప్రస్తుతం శ్రద్ధా ‘తుంబడ్’ దర్శకుడు రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అయితే, కొత్త సినిమాలను ప్రకటించకుండా సమయాన్ని వృథా చేస్తోందని అభిమానులు, సినీ ప్రేమికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సినిమా ప్రకటనకు సమయం లేకపోతే, ఈ విషయాలను పట్టించుకునేంత ఖాళీ ఆమె వద్ద ఉందా అని ప్రశ్నిస్తున్నారు.