19
August, 2026

A News 365Times Venture

19
Wednesday
August, 2026

A News 365Times Venture

Shiva Nirvana: మాకు ముందే తెలుసు.. ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు.!

Date:

Shiva Nirvana: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అయితే, తాము ఈ సోషల్ మీడియా విజ్ఞప్తుల కంటే ముందే ఈ సాంగ్ పెట్టాలని అనుకున్నామని తాజాగా దర్శకుడు చెప్పుకొచ్చారు.

అలాగే, ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సింగర్ డప్పు శీను వాయిస్‌లో ఏదో వెలితి కనిపిస్తోందని, ఒరిజినల్ వాయిస్ బేస్‌తో సరిపోలడం లేదని సోషల్ మీడియాలో కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయం మీద దర్శకుడిని ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నిజానికి తాము ఈ సాంగ్ ఎవరితో పాడించాలా అని అనుకున్నప్పుడు చాలా పేర్లు వినిపించాయని, నేపథ్య గాయకుల పేర్లు కూడా పరిశీలించామని, కానీ డప్పు శ్రీను గారితోనే పాడిస్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుందని భావించి ఆయనతోనే పాడించినట్లు చెప్పుకొచ్చారు. ఆయనను పిలిపించి హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్‌లో రికార్డింగ్ చేయించాక, తమకు కూడా అప్పటి వాయిస్ బేస్ ఎందుకో సరితూగలేదు అనిపించినట్లుగా ఆయన తెలిపారు.

ఒరిజినల్ సాంగ్ ఆయన పాడి దాదాపు 15 ఏళ్లకు పైగానే పూర్తయింది. అప్పటినుంచి ఆ పాటనే యూట్యూబ్‌లో మనమందరం వింటూ వచ్చాం. అప్పటి ఆయన వయసు వేరు, ఇప్పుడు పాడినప్పుడు ఆయన వయసు వేరు. కొంత బేస్ తగ్గిన మాట వాస్తవమే, కానీ ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని భావించి ఆ గౌరవం ఇచ్చాం. దీని మీద కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండవచ్చు, కానీ ఇది ఒరిజినల్ సింగర్‌కి తాము ఇవ్వాలనుకున్న గౌరవం అని ఆయన చెప్పుకొచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Star Batter: ఆ ప్లేయర్‌కు ఏమైంది..? అకస్మాత్తుగా ఆట మధ్యలో వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్..

గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు...

165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!

HONOR Pad 20 Pro Paperlike Edition: హానర్ (HONOR) నుండి...

Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..

దిగ్వేశ్ రాఠీ ఢిల్లీ తరఫున ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించి, 2024-25 సయ్యద్...