ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు పోటీ పడుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ టీంలు, ఐదు సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెతికలపడ్డాయి. మన హోం జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పరాజయాలను ఎదుర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకువెలుతున్నాయి.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్
నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో నాలుగు పరుగు స్పల్ప తేడాతో విజయ దుందుబీ మోగించింది. కానీ.. ఈ మ్యాచ్‌లో ఓ బౌలర్ మాత్రం చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆ బౌలర్? ఏంటి ఆ చెత్తి రికార్డు అనుకుంటున్నారా? ఆ బౌలర్ శార్దూల్ ఠాకూర్. శార్దూల్ ఒక ఓవర్‌లో 11 బంతులను వేసి మరో చెత్త రికార్డు సృష్టించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌ను వేసిన శార్దూల్ ఠాకూర్.. ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. మొత్తంగా 11 బంతులతో ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. తుషార్ దేశ్‌పాండే, మహ్మద్ సిరాజ్ తర్వాత 11 బాల్స్ వేసిన మూడో బౌలర్‌గా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. ఇదిలా ఉండగా.. ఈ ఓవర్ చివరి బంతికే కేకేఆర్ కెప్టెన్ రహానేను ఔట్ చేయడం విశేషం. గతంలో ఈ రికార్డులు ఏ బౌలర్ల మీద ఉన్నాయో చూద్దాం..
READ MORE: Shine Tom Chacko: వీక్ క్యారెక్టర్స్‌తో కెరీర్ డౌన్ చేసుకుంటున్న యాక్టర్
తుషార్ దేశ్‌పాండే (చెన్నై సూపర్ కింగ్స్) – 2023లో లక్నోపై 11 బంతులు
మహ్మద్ సిరాజ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 2023లో ముంబై పై 11 బంతులు
శార్దూల్ ఠాకూర్ (లక్నో సూపర్ జెయింట్స్) – 2025లో కోల్‌కతా పై 11 బంతులు