5
April, 2026

A News 365Times Venture

5
Sunday
April, 2026

A News 365Times Venture

Sajjala Ramakrishna Reddy: అమరావతి బిల్లు పాసయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు సంబరాలా..?

Date:

Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధాని అంశంపై మరోసారి రాజకీయ వాదోపవాదాలు ముదిరాయి. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి బిల్లు పాసైందని దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగా సంబరాలు చేయడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో ఇతర ప్రాంతాల ప్రజలను కూడా సంబరాల్లో పాల్గొనాలని కోరడం అన్యాయమని అన్నారు. రూ.2 లక్షల కోట్ల భారీ వ్యయంతో నిర్మించాల్సిన ప్రాజెక్టుపై సంబరాలు చేయమని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారని, అధికారులూ, ఉద్యోగులూ కూడా స్పందించలేదని పేర్కొన్నారు.

Read Also: US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..

మూడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించిందీ టీడీపీనేనని ఆరోపించిన సజ్జల, అమరావతికి కులరంగు పులిమింది కూడా చంద్రబాబేనని విమర్శించారు. అమరావతి అంశంలో అవినీతి జరిగిందని తాము ప్రశ్నిస్తున్నామని, కానీ ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక అంశాలపై కూడా సజ్జల తీవ్రంగా స్పందించారు. తక్కువ వడ్డీకి రుణాలు లభ్యమవుతున్న సమయంలో అధిక వడ్డీకి బాండ్లు తెచ్చుకోవడం ఎలా ఘనతగా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఈ అప్పుల భారాన్ని చివరికి ప్రజలే మోయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు చెప్పే అభివృద్ధి ప్రణాళికలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని సజ్జల అన్నారు. అమరావతి ఎప్పటికి పూర్తి అవుతుందో స్పష్టత లేదని, 2047 వరకు లాగి రాష్ట్ర ఖజానాను దోచుకోవడమే లక్ష్యమని విమర్శించారు. కేవలం కొన్ని భవనాలు కట్టడమే రాజధాని కాదని, ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్న ప్రాంతాల్లోనే రాజధాని అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇక, మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను కలిపే ‘మావిగన్’ ప్రతిపాదనను సమర్థిస్తూ, ఇది ఆచరణాత్మక ఆలోచన అని చెప్పారు. ఈ ప్రతిపాదనకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తున్నదని, రాష్ట్రంపై భారంలేని అభివృద్ధి మోడల్‌గా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

అదేవిధంగా అధికార వికేంద్రీకరణపై కూడా సజ్జల తన అభిప్రాయాలను వెల్లడించారు సజ్జల. దేశంలోని నిపుణులు సూచించిన విధంగా సమగ్ర అధ్యయనం చేసి తీసుకున్న నిర్ణయాలను టీడీపీ తప్పుగా చిత్రీకరిస్తోందని అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ఎగతాళి చేయడం సరికాదని పేర్కొన్నారు. చివరగా, ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. అమరావతి పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఆచరణాత్మక నిర్ణయాలే అవసరమని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kavitha : BRSలో కలవరానికి కారణమవుతున్న కవిత మాటలు

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. బీఆర్ఎస్ నుంచి...

Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

Off The Record: రాజకీయ పార్టీలు వ్యూహకర్తల్ని నియమించుకోవడం, వాళ్ళ సలహాల...

Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

Instagram Love Tragedy: కృష్ణా జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన ప్రేమ...

Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

Off The Record: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో...