19
September, 2026

A News 365Times Venture

19
Saturday
September, 2026

A News 365Times Venture

Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..

Date:

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుగా హైకోర్టుకు, లోయర్ కోర్టుకు ఇప్పటివరకు చెబుతూ వచ్చిన సిట్, తాజాగా ఏ4 సురేష్ రిమాండ్ రిపోర్టులో కీలక నిజాలను నివేదించింది. పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మృతి చెందాడని సిట్ స్పష్టం చేసింది.

విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సాయికృష్ణను దారుణంగా కొట్టారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పోలీసుల దెబ్బల కారణంగా గాయాలపాలైన సాయికృష్ణ పోలీస్‌స్టేషన్‌లోనే చనిపోలేదని, స్టేషన్‌లో ఉంచితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో సీఐ నాగరాజు ఆదేశాల మేరకు క్షతగాత్రుడైన సాయికృష్ణను రాణిగారి తోటలోని ఒక ప్రైవేట్ పాడుబడ్డ భవనానికి తరలించినట్లు సిట్ తెలిపింది.

మే 12, 2026వ తేదీన సీఐ నాగరాజును కలవడానికి వెళ్లిన సురేష్.. రాణిగారి తోటలోని ఖాళీ భవనంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న సాయికృష్ణను ప్రత్యక్షంగా చూసినట్లు వెల్లడైంది. ఆ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని సురేష్, సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కలిసి ఆయా తేదీల్లో దహనం చేశారని, ఎవరికీ ఎలాంటి ప్రాథమిక, సాంకేతిక ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని పూర్తిగా మాయం చేసి ధ్వంసం చేశారని సిట్ కోర్టుకు వివరించింది.

సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ లభించకుండా నిందితులందరూ కలిసి ముందుగానే చాలా జాగ్రత్తపడ్డారని సిట్ పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితులను కూలంకషంగా విచారించిన అనంతరం సాయికృష్ణ పోలీసుల దెబ్బల వల్లే హత్య చేయబడ్డాడని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి ఈనెల 24 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?

Air India Kanishka Bombing: 1985లో 329 మంది ప్రయాణికుల్ని బలిగొన్న...

OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..

OTR: తప్పుల మీద తప్పులు…. వరుస తడబాట్లు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల...

Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!

ఎయిర్ ఇండియా సంస్థలో భారీ మార్పులకు కొత్త సీఈవో టెవోల్డే గెబ్రెమరియమ్...

Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం

యూరప్‌లో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్...