20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!

Date:

S.S.Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ తన కెరీర్‌లో ఎందరో దర్శకులతో పనిచేశారు. కానీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆయనకు ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో త్రివిక్రమ్‌ను ఒక ‘యోగి’గా అభివర్ణించడమే కాకుండా, తన తదుపరి లక్ష్యాల గురించి తమన్ ధీమా వ్యక్తం చేశారు.

READ ALSO: Telangana Budget: ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. మూసికి రూ.1500 కోట్లు

ఒక ఆధ్యాత్మిక గురువు
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తనకున్న పరిచయం కేవలం దర్శకుడు-సంగీత దర్శకుడి సంబంధం మాత్రమే కాదని తమన్ స్పష్టం చేశారు. “త్రివిక్రమ్ గారు ఒక మేధావి. ఆయన పుస్తకాలు చదువుతారు, చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఆయనతో మాట్లాడటం ఒక మెడిటేషన్ (ధ్యానం) లాంటిది. ఒక వ్యక్తిని సరిగ్గా చదవగలిగే శక్తి ఆయనకు ఉంది. నన్ను ఒక మంచి మనిషిగా మార్చడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది” అని తమన్ కొనియాడారు. తమ మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన సంబంధం కాదని, అది ఒక లోతైన భావోద్వేగమని చెప్పారు. త్రివిక్రమ్ తనను నమ్మిన విధానం వల్లే ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వగలిగానని పేర్కొన్నారు. నా కెరీర్‌లో 100వ సినిమా అరవింద సమేత అని చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ దగ్గర రామాయణం స్రిప్ట్ ఉంది.. ఇప్పుడు మనం మాయాబజర్ సినిమాను ఎలా అయితే చూస్తున్నామో, మరొక వంద ఏళ్ల వరకు ఈ రామాయాణాన్ని జనాలు అలాగే చూస్తారని అన్నారు.

ఈ పాడ్‌కాస్ట్‌లో ఆస్కార్ అవార్డు ప్రస్తావన రాగా, థమన్ చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరుకుందని, మన కంటెంట్ చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందని అన్నారు. “నేను చేసే తదుపరి పెద్ద సినిమాలతో ఆస్కార్ స్థాయికి చేరుకోవాలనే పట్టుదలతో ఉన్నాను. మన మట్టి వాసన ఉన్న సంగీతాన్ని గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా అందించగలిగితే అది సాధ్యమే. దానికి కావాల్సిన కసి, సాంకేతికత మా దగ్గర ఉన్నాయి” అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండా ఎగురవేస్తాననే సంకేతాలు ఇచ్చారు.

READ ALSO: S.S.Thaman: తమన్ ప్రయాణం.. ‘బాయ్స్’ నుంచి ‘ఓజీ’ వరకు.. మైలురాళ్లు ఇవే!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sri Lanka Refuses US Military Aircraft Landing: అమెరికా యుద్ధ విమానాలు దిగేందుకు నో చెప్పిన శ్రీలంక..

Sri Lanka Refuses US Military Aircraft Landing: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ...

Industrial Diesel Price Hike: పెట్రోల్ తర్వాత షాకిచ్చిన డీజిల్.. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా...

Redmi 15A 5G: 6300mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరాలతో.. రెడ్‌మీ 15A 5G రిలీజ్ డేట్ ఫిక్స్

షియోమీ సబ్-బ్రాండ్ అయిన రెడ్‌మీ, రెడ్‌మీ 15 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను...

Dhurandhar 2: ధురందర్ 2 లో ఊహించని క్లైమాక్స్‌.. పార్ట్ 3 ఉంటుందా?

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ ఏవైటెడ్ సీక్వెల్ ‘ధురందర్:...