రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 9 మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విక్టరీ డే వేడుకలకు పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది రష్యా. అందులో భాగంగా భారతదేశానికి సైతం ఆహ్వానం పంపినట్లు రష్యా తెలిపింది. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ హాజరవుతున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.
READ MORE: Online Betting : బెట్టింగ్ యాప్‌కు మరోకరు బలి.. అత్తాపూర్‌లో ఎం.టెక్ విద్యార్థి ఆత్మహత్య
మరోవైపు.. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. మే 9న మాస్కోలో జరగనున్న విజయ దినోత్సవ వేడుకలకు హాజరు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఆహ్వానం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ధృవీకరించింది. ఈ వేడుకలో పాల్గొనే అంశంపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని రష్యా అధికారిక వార్తా సంస్థ తెలిపింది.