19
April, 2025

A News 365Times Venture

19
Saturday
April, 2025

A News 365Times Venture

RR vs LSG: మెరిసిన ఐడెన్ మార్క్రామ్, బదోని.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 181

Date:

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేడు రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజస్థాన్ జట్టు నుంచి సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్(3) మళ్లీ నిరాశ పర్చగా.. ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్(66) దూకుడుగా ఆడాడు. ఆయుష్ బదోని(50) అద్భుతంగా రాణించాడు. అర్ధ శతకం చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. చివరల్లో అబ్దుల్ సమద్ నాలుగు సిక్సులు బాది 30 పరుగులు జోడించాడు.

READ MORE: Pakistan: బంగ్లాదేశ్ దారిలో పాకిస్తాన్.. కేఎఫ్‌సీ రెస్టారెంట్లపై దాడులు..

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నోకు శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్.. మిచెల్ మార్ష్(4) వికెట్ పడగొట్టాడు. నికోలస్ పూరన్(11) పెద్దగా రాణించలేకపోయాడు. పురన్ పెవిలియన్‌కు చేరుకోగానే.. కెప్టెన్ పంత్ క్రీజ్‌లోకి ప్రవేశించాడు. రిషబ్ పంత్(3) ఎప్పటిలాగే నిరాశ పరిచాడు. ఐడెన్ మార్క్రామ్ మాత్రం అదరగొట్టాడు. 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 16 వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుష్ బదోని(50) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. చివరల్లో అబ్దుల్ సమద్(30) నాలుగు సిక్సులు బాది స్కోరు పెరుగుదలకు తోడ్పడ్డాడు. డేవిడ్ మిల్లర్ 7 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

LSG vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై లక్నో విజయం

LSG vs RR: ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన...

Punjab: పాక్ ఐఎస్ఐ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..

Punjab: పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ మద్దతు కలిగిన...

Actor Ali: అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

మన దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో నటించిన ప్రముఖ నటుడు అలీ,...

Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 90 మంది మృతి

హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా...