30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

Date:

రాజస్థాన్ రాయల్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ‘థంపింగ్ విక్టరీ’ని నమోదు చేసింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చెన్నై బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన ఇన్నింగ్స్‌లో సిక్సర్ల సునామీ సృష్టించిన వైభవ్, 17 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.

Off The Record: వైసీపీ కోసం మళ్లీ రంగంలోకి పీకే?

మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (38 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను ముగించగా, ధ్రువ్ జురెల్ (18) మెరుపులు మెరిపించాడు. చివరలో కెప్టెన్ రియాన్ పరాగ్ (14 నాటౌట్) సిక్సర్‌తో అలరించగా, జైస్వాల్ సింగిల్ తీసి రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. వర్షం కారణంగా పిచ్‌పై ఉన్న తేమను జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ అద్భుతంగా వాడుకున్నారు.

Iran: అణు బాంబు దిశగా ఇరాన్ ముందడుగు.. ప్రపంచ దేశాల్లో వణుకు!

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), సంజు శాంసన్ (6), ఆయుష్ మాత్రే (0), మాథ్యూ షార్ట్ (2) పవర్‌ప్లేలోనే పెవిలియన్ చేరారు. సర్ఫరాజ్ ఖాన్ (17), శివం దూబే (6) కాసేపు ప్రయత్నించినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ తమ స్పిన్ మాయాజాలంతో చెన్నైని కోలుకోనివ్వలేదు. జట్టు 100 పరుగులు దాటడం కష్టమనుకున్న తరుణంలో జేమీ ఓవర్టన్ (43) పోరాడాడు. అన్షుల్ కాంబోజ్‌తో కలిసి చివరి వికెట్‌కు 32 పరుగులు జోడించడంతో చెన్నై కనీసం ఆ స్కోరైనా చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!

హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న భారీ దందాను...

ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..

నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ. 25...

Upcoming Smartphones: బడ్జెట్‌ రెడీ చేసుకోండి.. రియల్‌మీ, రెడ్‌మీ, వివో, వన్‌ప్లస్, ఒప్పో ఫోన్స్ విడుదలకు సిద్ధం

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు బడ్జెట్ రెడీ చేసుకోండి. ఏప్రిల్...

Weight Loss Drugs: రూ.450తోనే బరువు తగ్గొచ్చు..! వైద్యుల వార్నింగ్..

Weight Loss Drugs: భారతదేశంలో బరువు తగ్గించే సెమాగ్లుటైడ్ మందు ఇప్పుడు...