ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎప్పుడూ ముందుంటుంది. ఆటలో కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి.. అభిమానులకు ఐపీఎల్ మరింత చేరువవుతోంది. ఈ క్రమంలో ప్రత్యక్ష ప్రసారంలో సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్దమైంది. బ్రాడ్‌కాస్ట్ టీమ్‌లో సరికొత్త సభ్యుడు ‘రోబో డాగ్’ వచ్చి చేరింది. బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో చేరిన రోబో డాగ్‌ను ప్రముఖ కామెంటేటర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మారిసన్ పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 13) అరుణ్ జెట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంగా రోబో డాగ్‌ను కామెంటేటర్ డానీ మారిసన్ పరిచయం చేశాడు. ఐపీఎల్ 2025 బ్రాడ్‌కాస్ట్ కవరేజీలో భాగంగా ఈ రోబో ఉంటుందని వెల్లడించారు. నిఘా, ప్రసార కెమెరా లక్షణాలతో దీనిని ఆవిష్కరించారు. మారిసన్ వాయిస్ కమాండ్‌లకు తగ్గట్టుగా
రోబో డాగ్ ఫీట్లు చేసి అందరినీ అలరించింది. మొదటిసారి దీనిని చూసిన తర్వాత అక్షర్ ఆశ్చర్యపోయాడు. క్యా హై యే? (ఇది ఏమిటి?) అని అడిగాడు. హార్దిక్ పాండ్యా రోబో డాగ్‌తో సంభాషించాడు. అది అక్షర్, పాండ్యాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది.
Also Read: IPL 2025: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2025 నుంచి స్టార్ ప్లేయర్ అవుట్!
రోబో డాగ్ వీడియోను ఐపీఎల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో సరికొత్త సభ్యుడు చేరాడు. ఇది నడవగలదు, పరిగెత్తగలదు, దూకగలదు. అంతేకాదు మిమ్మల్ని నవ్వించగలదు. మా అందమైన చిన్న స్నేహితుడికి పేరు పెట్టడంలో మీరు సహాయం చేయగలరా?’ అని రాసుకొచ్చింది. లక్కీ ఫాన్స్ నామకరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందుతారని కామెంటేటర్ డానీ మారిసన్ చెప్పాడు. క్రికెటర్లు రోబో డాగ్‌తో సరదాగా సంభాషించడం, దాని కదలికలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
𝗛𝗼𝗹𝗱 𝗼𝗻! 𝗪𝗲’𝘃𝗲 𝗮 𝗻𝗲𝘄 𝗜𝗣𝗟 𝗳𝗮𝗺𝗶𝗹𝘆 𝗺𝗲𝗺𝗯𝗲𝗿 𝗶𝗻 𝘁𝗼𝘄𝗻
It can walk, run, jump, and bring you a ‘heart(y)’ smile
And…A whole new vision
Meet the newest member of the #TATAIPL Broadcast family
– By @jigsactin
P.S: Can you help us in… pic.twitter.com/jlPS928MwV
— IndianPremierLeague (@IPL) April 13, 2025